రాష్ట్రంలో రియల్ మాఫియాకు చెక్ పెట్టేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రంగంలోకి దిగింది. రియల్ మాఫియాను నిలువరించే క్రమంలో ముందుగా అక్రమ లేఅవుట్లను నియంత్రించేందుకు సన్నాహాలు చేస్తోంది. ఇందులో భాగంగా కొద్దిసేపటి క్రితం ఏపీ సీఎం చంద్రబాబునాయుడు అధ్యక్షతన సమీక్షా సమావేశం ప్రారంభమైంది. అత్యంత ప్రాధాన్యమున్న ఈ సమావేశానికి డిప్యూటీ సీఎం, రెవెన్యూ శాఖ మంత్రి కేఈ కృష్ణమూర్తితో పాటు రెవెన్యూ శాఖ ఉన్నతాధికారులు కూడా హాజరయ్యారు.
రాష్ట్రానికి కొత్తగా రాజధాని ఏర్పాటవుతున్న నేపథ్యంలో గుంటూరు, కృష్ణా జిల్లాల్లో అక్రమ లేఅవుట్లు వేలాదిగా వెలిశాయి. దీంతో పెద్ద ఎత్తున మోసాలు కూడా జరుగుతున్నాయి. ఈ క్రమంలో నేరాల సంఖ్య కూడా పెరిగిపోతోంది. ఈ విపరిణామాలన్నింటికీ కారణంగా నిలుస్తున్న అక్రమ లేఅవుట్లను నియంత్రిస్తే సరిపోతుందన్న యోచనలో సర్కారు నేడు తొలి అడుగేసింది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు వెలువడే అవకాశాలున్నాయి.
More Telugu News
-
భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు
-
చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!
-
ఒక్క ఓవర్ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి
-
భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్
-
గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు
-
"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ
-
భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!
-
ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్
-
'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి
-
ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు
-
వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు
-
పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్
-
సౌదీలో చిక్కుకున్న ఉమ్రా యాత్రికులు.. రంగంలోకి దిగిన ప్రభుత్వాలు
-
షర్మిలకు జగన్ లేఖ.. మేనకోడలి పెళ్లికి బెంగళూరు ఇల్లు వద్దని స్పష్టీకరణ
-
పాకిస్థాన్ వల్లే కశ్మీరీలు బతుకుతున్నారు: ఫరూఖ్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు