ముఖ్యమంత్రులతో ప్రధాని నరేంద్ర మోదీ సమావేశం ముగిసిన అనంతరం ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పీఎంతో సమావేశానికి ఎక్కువ మంది ముఖ్యమంత్రులు వచ్చారని తెలిపారు. కాశ్మీర్, ఝార్ఖండ్ సీఎంలు ఎన్నికల కారణంగా గైర్హాజరయ్యారని వివరించారు. సీఎంల సమావేశంలో ప్రధానంగా ప్రణాళిక సంఘం స్థానంలో కొత్త వ్యవస్థ ఏర్పాటుపై చర్చ జరిగిందని జైట్లీ వెల్లడించారు. నూతన వ్యవస్థను ప్రధాని మోదీ ప్రతిపాదించారని, దీనికి సమ్మతిస్తూ దాదాపు ఏకాభిప్రాయం వ్యక్తమైందని చెప్పారు. కొత్త వ్యవస్థలో కేంద్ర, రాష్ట్రాలకు భాగస్వామ్యం ఉండాలని కొందరు సీఎంలు సూచించారని తెలిపారు. అధికారం, ప్రణాళికలను వికేంద్రీకరించాలని రాష్ట్రాలు కోరాయని చెప్పారు.
ప్రణాళిక సంఘం స్థానంలో ఏర్పాటయ్యే నూతన వ్యవస్థపై మూడు బృందాలు ఉంటాయన్నారు. తొలి బృందంలో ప్రధాని, ముఖ్యమంత్రులు... రెండో బృందంలో ప్రధాని, మంత్రివర్గం... మూడో బృందంలో ప్రధాని, ఉన్నతాధికారులు ఉంటారని ఆర్థిక మంత్రి వివరించారు. 1950లో ప్రణాళిక సంఘం ఏర్పడిందని, 1992లో దేశంలో సంస్కరణలు మొదలయ్యాయని జైట్లీ పేర్కొన్నారు. దేశానికి మరిన్ని ప్రణాళికలు అవసరమని ఈ సందర్భంగా అభిప్రాయపడ్డారు.
More Telugu News
-
భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు
-
చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!
-
ఒక్క ఓవర్ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి
-
భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్
-
గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు
-
"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ
-
భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!
-
ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్
-
'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి
-
ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు
-
వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు
-
పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్
-
సౌదీలో చిక్కుకున్న ఉమ్రా యాత్రికులు.. రంగంలోకి దిగిన ప్రభుత్వాలు
-
షర్మిలకు జగన్ లేఖ.. మేనకోడలి పెళ్లికి బెంగళూరు ఇల్లు వద్దని స్పష్టీకరణ
-
పాకిస్థాన్ వల్లే కశ్మీరీలు బతుకుతున్నారు: ఫరూఖ్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు