ప్రధాని నరేంద్ర మోదీ నేడు అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో భేటీ కానున్నారు. నేడు ఢిల్లీలో జరగనున్న సమావేశంలో ఆయన సీఎంలతో పలు విషయాలపై కూలంకషంగా చర్చిస్తారు. అంతేకాక వివిధ విధాన నిర్ణయాలపై ముఖ్యమంత్రుల సలహాలు, సూచనలు కూడా తీసుకుంటారు. ప్రధానంగా ప్రణాళిక సంఘాన్ని రద్దు చేస్తూ, దాని స్థానంలో కొత్తగా ఏర్పాటు చేయనున్న సంస్థ విధివిధానాలు, బాధ్యతలపై ఆయన ముఖ్యమంత్రుల అభిప్రాయాలను సేకరించనున్నట్లు సమాచారం.
కొత్త సంస్థ ఏర్పాటుకు సంబంధించి సీఎంలు వెల్లడించే అభిప్రాయాలకు ప్రాధాన్యమివ్వాలని మోదీ నిర్ణయించుకున్నట్లు ప్రధాన మంత్రిత్వ కార్యాలయ అధికార వర్గాలు వెల్లడించాయి. రాష్ట్రాలకు పూర్తి స్థాయిలో సాధికారత కల్పించడానికే తాము ప్రథమ ప్రాధాన్యమిస్తున్నామని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ ప్రకటించారు.
ప్రణాళిక సంఘం స్థానంలో కొత్తగా కార్యరంగంలోకి దిగనున్న సంస్థ ఈ దిశగా పనిచేయనుందని తెలుస్తోంది. నేటి సమావేశం సందర్భంగా కొత్త సంస్థ రూపకల్పన, విధివిధానాలపై ప్రణాళిక శాఖ కార్యదర్శి సింధుశ్రీ భుల్లార్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. అనంతరం మోదీ దీనిపై సీఎంల అభిప్రాయాలను స్వీకరిస్తారు.
More Telugu News
-
భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు
-
చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!
-
ఒక్క ఓవర్ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి
-
భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్
-
గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు
-
"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ
-
భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!
-
ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్
-
'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి
-
ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు
-
వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు
-
పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్
-
సౌదీలో చిక్కుకున్న ఉమ్రా యాత్రికులు.. రంగంలోకి దిగిన ప్రభుత్వాలు
-
షర్మిలకు జగన్ లేఖ.. మేనకోడలి పెళ్లికి బెంగళూరు ఇల్లు వద్దని స్పష్టీకరణ
-
పాకిస్థాన్ వల్లే కశ్మీరీలు బతుకుతున్నారు: ఫరూఖ్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు