ఓ ముస్లిం అమ్మాయి యుక్త వయసు వచ్చిన తరువాత లేదా పదిహేనేళ్లు నిండిన తరువాత వివాహం చేసుకోవచ్చని గుజరాత్ హైకోర్టు పేర్కొంది. ఓ ముస్లిం యువకుడు తన కమ్యూనిటీకే చెందిన 17 ఏళ్ల అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడన్న కారణంగా బాల్య వివాహ నిషేధ చట్టం కింద ఇటీవల ఓ పిటిషన్ దాఖలైంది. వివాహాన్ని నిరాకరించిన యువతి తల్లిదండ్రుల తరపున సూరత్ కు చెందిన 'గర్ల్స్ చిల్డ్రన్ హోం' ఆ పిటిషన్ వేసింది. దానిని పరిశీలించిన జస్టిస్ జేబీ.పర్దివాలా ధర్మాసనం, పిటిషన్ పై జరుగుతున్న న్యాయ విచారణను ఈ సందర్భంగా కొట్టివేసి, పైవిధంగా తీర్పు వెల్లడించింది. ముస్లిం చట్టం ప్రకారం, ఆ వర్గానికి చెందిన యువతి పదిహేనేళ్ళు దాటిన వెంటనే పెళ్లి చేసుకోవడానికి అర్హురాలిగా ప్రకటించింది.
"ఇది ముస్లిం అబ్బాయి, అమ్మాయి మధ్య వివాదం కాదు. ఆ వయసు దాటిన తరువాత ఆమె తల్లిదండ్రుల అనుమతి లేకుండా కూడా వివాహం చేసుకోవచ్చు" అని ధర్మాసనం పేర్కొంది. మరోవైపు కోర్టు విచారణ సమయంలో సదరు యువతి తల్లిదండ్రులు, పెళ్లి చేసుకున్న అబ్బాయి, అమ్మాయి హాజరయ్యారు. పెళ్లి విషయాన్ని కోర్టుకు ధ్రువీకరించారు. అత్తవారింట్లో భర్తతో తాను సంతోషంగా ఉన్నానని యువతి కోర్టుకు తెలిపింది. అటు ఆమె తల్లిదండ్రులు కూడా వారి వివాహాన్ని న్యాయస్థానం ముందు అంగీకరించారు.
More Telugu News
-
భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు
-
చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!
-
ఒక్క ఓవర్ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి
-
భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్
-
గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు
-
"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ
-
భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!
-
ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్
-
'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి
-
ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు
-
వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు
-
పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్
-
సౌదీలో చిక్కుకున్న ఉమ్రా యాత్రికులు.. రంగంలోకి దిగిన ప్రభుత్వాలు
-
షర్మిలకు జగన్ లేఖ.. మేనకోడలి పెళ్లికి బెంగళూరు ఇల్లు వద్దని స్పష్టీకరణ
-
పాకిస్థాన్ వల్లే కశ్మీరీలు బతుకుతున్నారు: ఫరూఖ్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు