ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ బిజినెస్ క్లాస్ టికెట్ పై దుబాయ్ కు విమానంలో వెళ్లడంపై వివాదాస్పదంగా మారింది. ప్రపంచ బ్రాండ్ సమ్మిట్ 'ఈ ఏడాది అత్యంత ప్రభావిత వ్యక్తి'గా కేజ్రీని ఎంపిక చేసింది. ఈ నేపథ్యంలో ఆయనను సన్మానించేందుకు సదరు సంస్థ ఆహ్వానించింది. ఆ అవార్డు కార్యక్రమానికి వెళ్లేందుకే ఆయన దుబాయ్ పయనమయ్యారు. కేజ్రీ తన బిజినెస్ సీటులో ఉన్న సమయలో ఓ ప్రయాణికుడు కలసి ఫోటో తీసుకున్నాడు. వెంటనే దాన్ని ట్విట్టర్ లో పెట్టాడు. అది కాస్తా ప్రతిపక్షానికి అవకాశంగా మారింది. 'ఆమ్ ఆద్మీ' కోసం అంటూనే బిజినెస్ క్లాస్ లో ప్రయాణిస్తారా? అని రాజకీయపార్టీల నుంచి విమర్శలు వెల్లువెత్తాయి.
ఢిల్లీ బీజేపీ అధికార ప్రతినిధి హరీష్ ఖురానా మాట్లాడుతూ, "ఈ విషయం ఏఏపీ రెండు రకాల వైఖరికి అద్దం పడుతుంది. వారి ఎన్నికల ప్రచారం కోసం ఓ చేత్తో ప్రజలను విరాళాలు అడుగుతూ, మరో చేత్తో బిజినెస్ క్లాస్ లో ప్రయాణాలు చేస్తున్నారు. ఎకానమీ క్లాస్ లోనే వెళ్లాలని కేజ్రీకి మేము చెప్పినా తిరస్కరించారు. పొదుపు చర్యలు పాటించాలని ఓ పక్క ఏఏపీ చెబుతుండగా, కేజ్రీ అలా ప్రయాణం చేయడం సరైంది కాదు" అని అన్నారు. వెంటనే ఆరోపణలను ఖండించిన ఆప్, కేజ్రీవాల్ టికెట్ నిర్వాహకులు స్పాన్సర్ చేసిందని స్పష్టం చేసింది.
More Telugu News
-
భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు
-
చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!
-
ఒక్క ఓవర్ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి
-
భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్
-
గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు
-
"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ
-
భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!
-
ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్
-
'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి
-
ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు
-
వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు
-
పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్
-
సౌదీలో చిక్కుకున్న ఉమ్రా యాత్రికులు.. రంగంలోకి దిగిన ప్రభుత్వాలు
-
షర్మిలకు జగన్ లేఖ.. మేనకోడలి పెళ్లికి బెంగళూరు ఇల్లు వద్దని స్పష్టీకరణ
-
పాకిస్థాన్ వల్లే కశ్మీరీలు బతుకుతున్నారు: ఫరూఖ్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు