ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ తాజా మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అమెరికా వర్సిటీ కొలంబియా విద్యార్థులను ఉద్దేశించి ఆదివారం ప్రసంగించనున్నారు. వర్సిటీలోని స్కూల్ ఆఫ్ ఇంటర్నేషనల్ అండ్ పబ్లిక్ అఫైర్స్ విద్యార్థులనుద్దేశించి కేజ్రీవాల్ ప్రసంగించనున్నారని షికాగోలో పార్టీ వాలంటీర్ మునీష్ రైజాదా వెల్లడించారు. రానున్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో చందాల వసూళ్ల కోసం కేజ్రీవాల్ గురువారం విదేశీ పర్యటనకు బయలుదేరిన సంగతి తెలిసిందే. అమెరికా, బ్రిటన్ లలో ఆప్ కు భారీ సంఖ్యలో మద్దతుదారులున్నారు. అమెరికా పర్యటనలో భాగంగా పార్టీ మద్దతుదారులతోనూ కేజ్రీవాల్ సమావేశమవుతారని రైజాదా తెలిపారు.