సూపర్‌స్టార్ రజనీకాంత్ తో 'రాఘవేంద్ర', విశ్వనాయకుడు కమలహాసన్ తో 'టిక్ టిక్ టిక్' సినిమాల్లో నటించిన హీరోయిన్ దుస్థితి చూసి తమిళసినీ పరిశ్రమ దిగ్భ్రాంతికి గురైంది. నటి నిషా ఎయిడ్స్ కోరల్లో చిక్కుకుని మరణపు అంచులలో కొట్టుమిట్టాడుతున్నారు. నాగపట్టణం జిల్లా నాచూర్ గ్రామానికి చెందిన నిషా ఎయిడ్స్ రోగంతో బాధపడుతున్న ఫోటోలు ఇటీవల వాట్సాప్, సామాజిక వెబ్ సైట్ లలో ప్రచారం అయ్యాయి.
ఆరోగ్యం పూర్తిగా క్షీణించి అస్థిపంజరం లాంటి దేహంతో నాబూర్ దర్గా సమీపంలో వారం రోజులుగా అనాథగా పడి వున్న నటి నిషాను పట్టించుకున్న నాధుడు లేకుండా పోయారు. కాగా, ఆ దుస్థితిలో ఆమె శరీరం నిండా చీమలు, ఈగలు ముసిరి ఉన్నాయి. 30 ఏళ్ల క్రితం సినిమాలో కథానాయికగా ప్రకాశించిన నటి నిషా దయనీయ స్థితిని తెలియజేస్తూ, ఫోటోలతో ఒక మెస్సేజ్ జాతీయ మానవ హక్కుల సంఘం సభ్యుడు న్యాయమూర్తి మురుగేశన్ కు అందింది.
ఆ దృశ్యాలు ఆయన మనసును కలచి వేశాయి. వెంటనే ఆయన స్పందించారు. నిషాకు వెంటనే వైద్య చికిత్స ఏర్పాటు చేయాల్సిందిగా నాగపట్టణం జిల్లా కలెక్టర్, పోలీసు సూపరింటెండెంట్ లను ఆదేశించారు. ఆమె ఆరోగ్య వివరాలను నాలుగు వారాల్లోగా అందించాలని ఆయన ఉత్తర్వులు జారీ చేశారు.
More Telugu News
-
భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు
-
చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!
-
ఒక్క ఓవర్ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి
-
భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్
-
గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు
-
"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ
-
భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!
-
ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్
-
'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి
-
ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు
-
వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు
-
పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్
-
సౌదీలో చిక్కుకున్న ఉమ్రా యాత్రికులు.. రంగంలోకి దిగిన ప్రభుత్వాలు
-
షర్మిలకు జగన్ లేఖ.. మేనకోడలి పెళ్లికి బెంగళూరు ఇల్లు వద్దని స్పష్టీకరణ
-
పాకిస్థాన్ వల్లే కశ్మీరీలు బతుకుతున్నారు: ఫరూఖ్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు