ఇప్పటికే కేంద్ర మంత్రి సాధ్వి నిరంజన్ జ్యోతి వివాదాస్పద వ్యాఖ్యలతో ఇంటా బయటా గడ్డు పరిస్థితి ఎదుర్కొంటున్న బీజేపీ మరో వివాదం సుడిలో చిక్కుకుంది. ఈరోజు పార్లమెంట్ సమావేశాల్లో భాగంగా లోక్ సభ లో ఆ పార్టీ ఎంపీ, ఉత్తరాఖండ్ మాజీ ముఖ్యమంత్రి రమేశ్ ఫోఖ్రియాల్ ఈ వివాదాన్ని రేపారు. సైన్స్ ను జ్యోతిష్య శాస్త్రంతో పోల్చిన ఆయన, జ్యోతిష్యం ముందు సైన్స్ మరుగుజ్జు లాంటిదని వ్యాఖ్యానించారు. పాఠశాల ప్రణాళిక, వాస్తు శాస్త్రానికి మరింత దన్ను ఇవ్వాలన్న బిల్లుకు లోక్ సభ మూజువాణి ఓటుతో ఆమోదం తెలిపింది.
ఈ సందర్భంగా జరిగిన చర్చలో పాల్గొన్న రమేశ్ ‘‘అణ్వస్త్ర పరీక్షల గురించి మనం ఇప్పుడు మాట్లాడుకుంటున్నాం. అయితే లక్షల ఏళ్ల క్రితమే కణ్వ మహర్షి అణ్వస్త్ర పరీక్షలు చేశారు. పురాతన జ్యోతిష్యుల ముందు ఆధునిక సాంకేతికత ఏమాత్రం సాటి రాదు. ప్రపంచం మొత్తంలో జ్యోతిష్యానిదే అగ్రస్థానం’’ అని ఆయన వ్యాఖ్యానించారు. దీనిపై కాంగ్రెస్ సహా వామపక్షాలు, తృణమూల్ కాంగ్రెస్ పార్టీలు భగ్గుమన్నాయి.
శాస్త్ర సాంకేతిక రంగాల్లో దూసుకెళుతున్న భారత్ ను ఈ వ్యాఖ్యలు కించపరచేవేనని ఆరోపించాయి. మరో అడుగు ముందుకేసిన తృణమూల్ ఎంపీ సౌగతా రాయ్ ‘‘మంత్రి స్మృతి ఇరానీ గంటల తరబడి జ్యోతిష్యుల వద్ద కూర్చుని జాతకాలు చెప్పించుకోవడం చెడు సంకేతాలను పంపిస్తుంది’’ అని మోదీ సర్కారుపై విరుచుకుపడ్డారు.
More Telugu News
-
60 అడుగల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్
-
ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!
-
కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్
-
ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!
-
కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్
-
కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి
-
భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు
-
చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!
-
ఒక్క ఓవర్ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి
-
భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్
-
గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు
-
"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ
-
భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!
-
ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్
-
'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి