ఆస్ట్రేలియా క్రికెటర్ ఫిల్ హ్యూజెస్ కుటుంబానికి అండగా నిలుస్తామని, ఎలాంటి సహకారమైనా అందించేందుకు సిద్ధంగా ఉన్నామని భారత క్రికెట్ జట్టు ప్రకటించింది. ఎన్నో ఆశలతో క్రికెట్ ను కెరీర్ గా ఎంచుకుని మంచి ఫాంలో ఉండి, ఆసీస్ జట్టులో స్థానం సంపాదించుకుంటాడని భావిస్తున్న దశలో ఫిల్ హ్యూజెస్ గాయపడడం తమను ఆందోళనకు గురిచేసిందని టీమిండియా ఓ ప్రకటనలో తెలిపింది.
అతని ఆరోగ్య పరిస్థితిపై ఆసీస్ అధికారుల నుంచి సమాచారం తెలుసుకుంటున్నామని టీమిండియా వర్గాలు పేర్కొన్నాయి. కాగా, షెఫీల్డ్ షీల్డ్ దేశవాళీ పోటీల్లో భాగంగా సిడ్నీలో మ్యాచ్ ఆడుతున్న సందర్భంగా ఓ బౌలర్ విసిరిన బౌన్సర్ బలంగా తలకు తగలడంతో హ్యూజెస్ కుప్పకూలిన సంగతి తెలిసిందే. దీంతో, అతనిని హెలికాప్టర్లో సెయింట్ విన్సెంట్ ఆసుపత్రికి తరలించి శస్త్రచికిత్స చేశారు. అయినప్పటికీ అతని ఆరోగ్యపరిస్థితి ఆందోళనకరంగానే ఉందని వైద్యులు తెలిపారు. దీంతో క్రికెట్ ప్రపంచం ఆందోళనలో మునిగిపోయింది.
More Telugu News
-
భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు
-
చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!
-
ఒక్క ఓవర్ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి
-
భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్
-
గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు
-
"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ
-
భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!
-
ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్
-
'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి
-
ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు
-
వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు
-
పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్
-
సౌదీలో చిక్కుకున్న ఉమ్రా యాత్రికులు.. రంగంలోకి దిగిన ప్రభుత్వాలు
-
షర్మిలకు జగన్ లేఖ.. మేనకోడలి పెళ్లికి బెంగళూరు ఇల్లు వద్దని స్పష్టీకరణ
-
పాకిస్థాన్ వల్లే కశ్మీరీలు బతుకుతున్నారు: ఫరూఖ్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు