చాక్లెట్ల లారీని యజమాని సహా సినీ ఫక్కీలో కిడ్నాప్ చేయడం జరిగింది. వివరాల్లోకి వెళితే... మధ్యప్రదేశ్ లోని ఇండోర్ నుంచి చెన్నైకు చాక్లెట్ల లోడుతో మినీ లారీ బయల్దేరింది. తడ మండలంలోని పెరియవట్టు వద్దకు లారీ వచ్చే సరికి స్కార్పియో వాహనంలో ఎనిమిది మంది గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి వాణిజ్యపన్ను అధికారులమంటూ లారీని ఆపారు.
'రికార్డులు తీసుకురండి' అంటూ చెప్పడంతో డ్రైవర్ దర్బార్ సింగ్, క్లీనర్ శంకర్ కిందికి దిగారు. వీరిద్దరినీ బలవంతంగా స్కార్పియోలొకి ఎక్కించుకుని కాళ్లు, చేతులు కట్టేసి కళ్లకు గంతలు కట్టారు. దగ్గర్లోని అటవీ ప్రాంతంలోకి తీసుకెళ్లి అక్కడ వారిని విడిచిపెట్టి వెనుదిరిగారు. అటు, లారీలో ఉన్న యజమాని దినేష్ చౌహాన్ సహా లారీని మరో ముగ్గురు దుండగులు ఎత్తుకెళ్లిపోయారు.
కాగా, లారీ ఆచూకీ తెలియలేదు. అటవీ ప్రాంతంలో వదిలివేయబడ్డ డ్రైవర్, క్లీనర్ తమిళనాడు పరిధిలోని ఆరంబాక్కం పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేయగా, సంఘటన జరిగిన ప్రాంతం తమ పరిధిలోకి రాదని చెప్పి వారిని పంపేశారు. దీంతో, వారు నెల్లూరు జిల్లాలోని తడ పోలీస్ స్టేషన్ కు చేరుకుని ఫిర్యాదు చేశారు. వెంటనే స్పందించిన డీఎస్పీ... సీఐల సహా బాధితులతో సంఘటనా స్థలి పరిశీలించేందుకు వెళ్లారు.
More Telugu News
-
భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు
-
చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!
-
ఒక్క ఓవర్ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి
-
భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్
-
గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు
-
"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ
-
భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!
-
ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్
-
'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి
-
ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు
-
వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు
-
పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్
-
సౌదీలో చిక్కుకున్న ఉమ్రా యాత్రికులు.. రంగంలోకి దిగిన ప్రభుత్వాలు
-
షర్మిలకు జగన్ లేఖ.. మేనకోడలి పెళ్లికి బెంగళూరు ఇల్లు వద్దని స్పష్టీకరణ
-
పాకిస్థాన్ వల్లే కశ్మీరీలు బతుకుతున్నారు: ఫరూఖ్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు