భార్యాభర్తలిద్దరూ ఉద్యోగాలు చేస్తేకానీ మెరుగైన జీవనం అందని పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో చంటి పిల్లలను చూసుకునేందుకు ఆయాలను పెట్టుకోక తప్పడం లేదు. జీవనోపాధి కోసం ఆయాలుగా కుదురుతున్నవారు పసివారితో వ్యవహరిస్తున్న తీరు తల్లిదండ్రులను ఆందోళనకు గురిచేస్తోంది. కొంత మంది తల్లిదండ్రులు ఆయాలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉగాండాలో జాలీ తుముహిర్వే అనే ఆయా పసివాడితో వ్యవహరించిన తీరు పట్ల సర్వత్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది.
లాలించి, బుజ్జగించి పసిపాపకు ఆహారం అందించాల్సిన ఆయా చిన్న పిల్ల తినకుండా మారాం చేస్తోందని, సోఫాలోంచి కిందికి విసిరేసింది. అప్పటికీ చెప్పిన మాట వినడం లేదని టార్చిలైటుతో కొట్టింది. కసి తీరలేదో ఏమోకానీ కాలుతో తొక్కేసింది. ఇంత జరిగిన తరువాత పసిపాప ఏడవకుండా ఉంటుందా? ఏడుస్తున్న పసిపాపను కాలితో అంతదూరం తన్నేసింది. దీంతో, పాప ఇల్లు ఠారెత్తిపోయేలా ఏడుపులంకించుకుంది.
దీంతో, ఇంకా చిరాకు పెంచుకున్న ఆయా అటూ, ఇటూ పాపను తొక్కుకుంటూ నడిచింది. ఇంకా కోపం తగ్గకపోవడంతో మళ్లీ అటూ ఇటూ తొక్కుకుంటూ వెళ్లింది. ఇంట్లోని సీసీటీవీ కెమెరాలో ఆమె నిర్వాకమంతా రికార్డయింది. దీంతో, పసిపాప తల్లిదండ్రులు ఆయాపై హత్యాయత్నం కేసు పెట్టారు. సాధారణంగా తమ పిల్లలను ఎవరైనా ఆయాలు ఇలా చేయడం చూస్తే తల్లిదండ్రులు చంపేస్తారని ఉగాండా కార్మిక, సామాజిక అభివృద్ధి శాఖ మంత్రి మేరీ కరూరో ఓకురుట్ అన్నారు. అయినప్పటికీ సదరు తల్లిదండ్రులు చట్టాన్ని ఆశ్రయించడం అభినందనీయమని ఒకురుట్ ప్రశంసించారు. డిసెంబర్ 8న ఆ ఆయాను కోర్టులో ప్రవేశపెట్టనున్నారు.
More Telugu News
-
భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు
-
చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!
-
ఒక్క ఓవర్ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి
-
భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్
-
గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు
-
"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ
-
భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!
-
ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్
-
'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి
-
ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు
-
వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు
-
పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్
-
సౌదీలో చిక్కుకున్న ఉమ్రా యాత్రికులు.. రంగంలోకి దిగిన ప్రభుత్వాలు
-
షర్మిలకు జగన్ లేఖ.. మేనకోడలి పెళ్లికి బెంగళూరు ఇల్లు వద్దని స్పష్టీకరణ
-
పాకిస్థాన్ వల్లే కశ్మీరీలు బతుకుతున్నారు: ఫరూఖ్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు