బెల్జియంలో ఓ పాకిస్థానీ యువకుడు బ్యాట్ తీసుకెళుతుంటే అతడిపైనా, అతడి కుటుంబంపైనా టెర్రర్ ముద్రవేశారు. వివరాల్లోకివెళితే... ఈ ఏడాది ఆరంభంలో బ్రస్సెల్స్ లోని జ్యూయిష్ మ్యూజియంపై దాడి జరిగింది. ఇది ఉగ్రవాదుల పనే అని అనుమానించారు. ఈ నేపథ్యంలో, పోలీసులు గతవారం ఓ ఫొటో విడుదల చేశారు. ఆ ఫొటోలో ఓ యువకుడు చొక్కా కింద ఏదో దాచి తీసుకువెళుతున్నట్టుగా ఉంది. ఆ ఫొటోలో ఉన్న యువకుడి పేరు అసీమ్ అబ్బాసి (22). అతడి తండ్రి బెల్జియంలో పాక్ దౌత్యాధికారి. కాగా, ఆ ఫొటోలు చూసిన అబ్బాసి వెంటనే పోలీసుల వద్దకు వెళ్లి, తాను చొక్కా కింద పెట్టుకుని తీసుకువెళుతున్నది ఆయుధం కాదని, క్రికెట్ బ్యాట్ అని వివరణ ఇచ్చాడు.
ప్రాక్టీసుకు వెళుతుండగా, వర్షం రావడంతో బ్యాట్ ను చొక్కా కింద దాచానని తెలిపాడు. అయితే, ఇదేమీ పట్టించుకోని పోలీసులు తదుపరి చర్యలకు ఊపక్రమించారు. అటు, పాక్ ఎంబసీ దేశ ప్రతిష్ఠకు భంగం కలిగించారంటూ అబ్బాసి తండ్రిని విధుల నుంచి తొలగించింది. తమకు పాక్ ఎంబసీ నుంచి పిలుపు వచ్చిందని, పాస్ పోర్టులు ఇచ్చేయాలని చెప్పారని అబ్బాసి తెలిపాడు. బెల్జియంలో నివసించే అవకాశం కోల్పోయామని, తాను చదువుతోపాటు, అన్నీ నష్టపోయానని అబ్బాసి వాపోయాడు.
More Telugu News
-
భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు
-
చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!
-
ఒక్క ఓవర్ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి
-
భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్
-
గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు
-
"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ
-
భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!
-
ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్
-
'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి
-
ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు
-
వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు
-
పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్
-
సౌదీలో చిక్కుకున్న ఉమ్రా యాత్రికులు.. రంగంలోకి దిగిన ప్రభుత్వాలు
-
షర్మిలకు జగన్ లేఖ.. మేనకోడలి పెళ్లికి బెంగళూరు ఇల్లు వద్దని స్పష్టీకరణ
-
పాకిస్థాన్ వల్లే కశ్మీరీలు బతుకుతున్నారు: ఫరూఖ్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు