దేశంలో సిగరెట్ల వాడకాన్ని మరింత తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోబోతోంది. లూజ్ సిగరెట్ల విక్రయాలను నిషేధించాలంటూ నిపుణుల కమిటీ సూచించిన సిఫారసులకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తాజాగా అంగీకారం తెలిపింది. ఈ మేరకు రాజ్యసభలో మంత్రి జేపీ నద్దా లిఖితపూర్వక సమాధానమిచ్చారు. "లూజ్ సిగరెట్లు లేదా సింగిల్ సిగరెట్ అమ్మకంపై నిషేధం విధించాలని నిపుణుల కమిటీ సూచించింది. అంతేగాక, పొగాకు ఉత్పత్తులను కొనేందుకు చట్టపరంగా కనీస వయసును పెంచింది. దాంతోపాటు పొగాకు ఉత్పత్తుల చట్టం, 2003 కింద సిగరెట్ల విషయంలో నిబంధనలను ఉల్లంఘిస్తే చెల్లించాల్సిన జరిమానా మొత్తాన్ని కూడా పెంచింది. ఆరోగ్య శాఖ వాటన్నింటికీ ఆమోదం తెలిపింది. దీనిపై డ్రాఫ్ట్ నోట్ ను సలహాల కోసం కేబినెట్ కు పంపించాం" అని తెలిపారు.
ఈ కమిటీ సిఫారసులను అమలు చేయాలంటే ముందు పార్లమెంటులో ఆ డ్రాఫ్ట్ ను బిల్లు రూపంలో తీసుకువచ్చి ఆమోదం పొందాల్సిన అవసరం ఉంది. కొత్తగా రాబోతున్న నిబంధనలు పొగాకు పరిశ్రమపై భారీగా ప్రభావం చూపుతాయని విశ్లేషకులు అంటున్నారు.
More Telugu News
-
భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు
-
చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!
-
ఒక్క ఓవర్ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి
-
భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్
-
గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు
-
"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ
-
భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!
-
ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్
-
'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి
-
ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు
-
వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు
-
పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్
-
సౌదీలో చిక్కుకున్న ఉమ్రా యాత్రికులు.. రంగంలోకి దిగిన ప్రభుత్వాలు
-
షర్మిలకు జగన్ లేఖ.. మేనకోడలి పెళ్లికి బెంగళూరు ఇల్లు వద్దని స్పష్టీకరణ
-
పాకిస్థాన్ వల్లే కశ్మీరీలు బతుకుతున్నారు: ఫరూఖ్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు