స్మార్ట్ ఫోన్ ల రాకతో యువతలో సెల్ఫీల మోజు ఎక్కువైంది. క్లాస్ రూంలో సెల్ఫీ, ఆఫీసులో సెల్ఫీ, విహారయాత్రలో సెల్ఫీ, చివరికి ఆసుపత్రి బెడ్ పై నుంచి కూడా సెల్ఫీయే! అంతలా పాకిపోయింది! ఫేస్ బుక్ లో సెల్ఫీ పోస్టు చేసిన క్షణం నుంచీ లైక్స్ కోసం కాచుకు కూర్చుంటున్నారు. ఛత్తీస్ గఢ్ కు చెందిన ఈ తొమ్మిదో తరగతి విద్యార్థి కూడా అలాంటివాడే. అయితే, ప్రాణాలు కోల్పోయాడు! వివరాల్లోకి వెళితే... సెయింట్ ఫ్రాన్సిస్ స్కూల్లో విద్యాభ్యాసం చేస్తున్న ఆ విద్యార్థి పేరు కేతన్. బిలాస్ పూర్ జిల్లా వైశాలి నగర్ వాసి. కేతన్ తండ్రి సంజయ్ పోద్దార్ రైల్వేలో ఇంజన్ డ్రైవర్. ఆదివారం సాయంత్రం మిత్రులతో కలిసి కేతన్ ఉస్లాపూర్ లోకోమోటివ్ సబ్ స్టేషన్ వద్దకు వెళ్లాడు. అక్కడ గతంలో ఓ గూడ్సు రైలు పై నిలబడి తీసుకున్న ప్రొఫైల్ పిక్చర్ కు ఫేస్ బుక్ లో ఎన్నో లైక్స్, కామెంట్స్ వచ్చాయి. అందుకే మరోసారి అక్కడే, అదే రైలుపై నిలబడి ఫొటో తీసుకునేందుకు ప్రయత్నించాడు. ఆ ప్రయత్నంలో గూడ్సు రైలు ఎక్కాడు.
కొన్ని స్నాప్స్ క్లిక్ చేసిన తర్వాత, చేతులు పైకెత్తి పోజ్ ఇవ్వబోయాడు. పైన ఉన్న విద్యుత్ వైర్లు అతని చేతులకు తగలడంతో విద్యుదాఘాతానికి లోనయ్యాడు. దీంతో, అతని మిత్రులు భయపడ్డారు. విషయం ఎవరికీ చెప్పకుండా, ఎవరింటికి వారు వెళ్లిపోయారు. కేతన్ ఎంతకీ ఇంటికి రాకపోవడంతో అతని తల్లిదండ్రులు వెదుకులాట ప్రారంభించారు. అతని స్నేహితులను గట్టిగా అడిగితే, అప్పుడు చెప్పారు... కేతన్ చనిపోయాడని. పోలీసులు ఆ విద్యార్థి మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని, దర్యాప్తు ఆరంభించారు.
More Telugu News
-
కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి
-
భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు
-
చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!
-
ఒక్క ఓవర్ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి
-
భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్
-
గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు
-
"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ
-
భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!
-
ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్
-
'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి
-
ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు
-
వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు
-
పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్
-
సౌదీలో చిక్కుకున్న ఉమ్రా యాత్రికులు.. రంగంలోకి దిగిన ప్రభుత్వాలు
-
షర్మిలకు జగన్ లేఖ.. మేనకోడలి పెళ్లికి బెంగళూరు ఇల్లు వద్దని స్పష్టీకరణ