ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) లో చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ జట్ల ప్రస్థానం ముగిసినట్టేనన్న వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. ఐపీఎల్-6లో బెట్టింగ్ కు పాల్పడ్డ గురునాథ్ మెయెప్పన్ చెన్నై జట్టు అధికారేనన్న వాదన బలపడితే చెన్నై జట్టు ఐపీఎల్ నుంచి నిష్క్రమించక తప్పని పరిస్థితి నెలకొంది. ఒకవేళ ఇదే జరిగితే రాజ్ కుంద్రా కారణంగా రాజస్థాన్ కూడా ఇదే విపత్కర పరిస్థితిని ఎదుర్కోనుంది. సోమవారం బీసీసీఐ అధ్యక్షుడు శ్రీనివాసన్ పిటిషన్ ను విచారించిన సందర్భంగా సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఈ రెండు జట్ల నిష్క్రమణ తప్పదన్న భావన వ్యక్తమవుతోంది.
ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్ పై విచారణ జరిపిన జస్టిస్ ముకుల్ ముద్గల్ కమిటీ నివేదిక నేపథ్యంలో పలు కీలక పరిణామాలు తప్పవని తెలిసినా, ఏకంగా రెండు జట్లపై వేటు పడే దిశగా అడుగులు పడుతుండటం క్రికెట్ అభిమానులను కలవరపెడుతోంది. ఐపీఎల్ లో విజయవంతంగా రాణిస్తున్న ఈ రెండు జట్లు సిరీస్ నుంచి తప్పుకోవాల్సి వస్తే, ఐపీఎల్ కే ఆదరణ తగ్గుతుందన్నది కాదనలేని వాస్తవం.
More Telugu News
-
భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు
-
చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!
-
ఒక్క ఓవర్ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి
-
భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్
-
గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు
-
"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ
-
భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!
-
ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్
-
'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి
-
ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు
-
వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు
-
పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్
-
సౌదీలో చిక్కుకున్న ఉమ్రా యాత్రికులు.. రంగంలోకి దిగిన ప్రభుత్వాలు
-
షర్మిలకు జగన్ లేఖ.. మేనకోడలి పెళ్లికి బెంగళూరు ఇల్లు వద్దని స్పష్టీకరణ
-
పాకిస్థాన్ వల్లే కశ్మీరీలు బతుకుతున్నారు: ఫరూఖ్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు