హైదరాబాద్ నగర పరిధిలోని మల్కాజిగిరికి చెందిన ఓ కార్పొరేట్ పాఠశాలలో అరాచక పర్వం వెలుగు చూసింది. పాఠశాలలోని బాలికలపై తోటి విద్యార్థులు లైంగిక వేధింపులకు పాల్పడటమే కాక ఆ వేధింపులను సెల్ ఫోన్లలో చిత్రీకరించారు. సదరు వీడియోలను తమ మిత్రులకు పంపుతూ పాఠశాల బాలురు వికృత చేష్టలకు పాల్పడ్డ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. టాయ్ లెట్లకు వెళ్లిన బాలికలను రహస్యంగా కెమెరాల్లో బంధించిన బాలురు తమ పైశాచికత్వాన్ని చాటుకున్నారు.
బాలుర అకృత్యాలను గమనించిన బాలికలు పాఠశాల యాజమాన్యానికి ఫిర్యాదు చేశారు. ఈ పిర్యాదుపై పాఠశాల యాజమాన్యం స్పందించలేదు. దీంతో బాలికలు విషయాన్ని తమ తల్లిదండ్రులకు తెలిపారు. బాలికల తల్లిదండ్రులకు కూడా పాఠశాల యాజమాన్యం స్పందించిన పాపాన పోలేదు. దీంతో బాలికల తల్లిదండ్రులు విద్యార్థి సంఘాలను ఆశ్రయించారు. పాఠశాల యాజమాన్యం నిర్లక్ష్య వైఖరి, బాలుర అకృత్యాలను నిరసిస్తూ విద్యార్థి సంఘాలు నేడు మల్కాజిగిరి పరిధిలో విద్యాసంస్థల బంద్ కు పిలుపునిచ్చాయి.
More Telugu News
-
భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు
-
చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!
-
ఒక్క ఓవర్ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి
-
భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్
-
గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు
-
"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ
-
భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!
-
ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్
-
'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి
-
ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు
-
వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు
-
పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్
-
సౌదీలో చిక్కుకున్న ఉమ్రా యాత్రికులు.. రంగంలోకి దిగిన ప్రభుత్వాలు
-
షర్మిలకు జగన్ లేఖ.. మేనకోడలి పెళ్లికి బెంగళూరు ఇల్లు వద్దని స్పష్టీకరణ
-
పాకిస్థాన్ వల్లే కశ్మీరీలు బతుకుతున్నారు: ఫరూఖ్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు