వారం క్రితం కేబీఆర్ పార్కు వద్ద పారిశ్రామిక వేత్త నిత్యానందరెడ్డి కిడ్నాప్ కు ప్రయత్నించి పట్టుబడిన ఓబులేసు రిమాండ్ రిపోర్టు బయటికి వచ్చింది. దాని ప్రకారం ఓబులేసు పోలీసులకిచ్చిన వాంగ్మూలంలో తనకు ప్రాణాంతక వ్యాధి సోకిందని, చివరి క్షణాల్లో జీవితాన్ని ఎంజాయ్ చేయాలనుకున్నానని, అందుకే అక్రమంగా డబ్బు సంపాదించేందుకు కిడ్నాప్ మార్గాన్ని ఎంచుకున్నానని చెప్పాడు.
12 ఏళ్ల పాటు గ్రేహౌండ్స్‌లో విధులు నిర్వర్తించిన తాను ఏకే 47ను దొంగిలించింది కూడా అందుకేనని ఓబులేసు తెలిపాడు. ప్రముఖులను కిడ్నాప్ చేసి పెద్దమొత్తంలో డబ్బు డిమాండ్ చేయాలనుకున్నానని విచారణ సందర్భంగా అంగీకరించాడు. 2014 ఫిబ్రవరి 19న ఓ ప్రముఖ పారిశ్రామికవేత్త కుమారుడిని అపహరించి, ఆ యువకుడి తల్లిదండ్రుల నుంచి 10 లక్షల రూపాయలు వసూలు చేసినట్టు తెలిపాడు.
ప్రతిరోజూ కేబీఆర్ పార్కుకు వాకింగ్ కోసం డబ్బున్న వాళ్లు, పెద్దపెద్ద కార్లలో రావడం గమనించేవాడినని ఓబులేసు తెలిపాడు. డ్రైవర్ లేని కారులో ఓనర్ ఎక్కిన తరువాత ఆ కారులో దూరి యజమానిని బెదిరించి డబ్బులు గుంజాలని పథకం వేసినట్టు ఒబులేసు తెలిపాడు. అందుకే నిత్యానందరెడ్డి సీటు బెల్టు పెట్టుకుంటున్న సమయంలో కారులో దూరి, ఏకే 47తో బెదిరించానని విచారణలో అంగీకరించాడు.
దీంతో అతడిని బంజారాహిల్స్ పోలీసులు నాలుగు రోజుల కస్టడీకి తీసుకున్నారు. న్యాయస్థానం ఆదేశాల మేరకు అతనిని విచారణ చేసి, అతని రూంలో లభ్యమైన ఆరు రకాల తుపాకుల గుళ్లకు సంబంధించిన సమాచారం సేకరించనున్నారు.
More Telugu News
-
భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు
-
చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!
-
ఒక్క ఓవర్ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి
-
భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్
-
గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు
-
"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ
-
భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!
-
ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్
-
'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి
-
ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు
-
వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు
-
పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్
-
సౌదీలో చిక్కుకున్న ఉమ్రా యాత్రికులు.. రంగంలోకి దిగిన ప్రభుత్వాలు
-
షర్మిలకు జగన్ లేఖ.. మేనకోడలి పెళ్లికి బెంగళూరు ఇల్లు వద్దని స్పష్టీకరణ
-
పాకిస్థాన్ వల్లే కశ్మీరీలు బతుకుతున్నారు: ఫరూఖ్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు