ఆంధ్రప్రదేశ్ రాజధాని విజయవాడలో రాత్రిపూట గస్తీ పెంచడంతో నేరాల సంఖ్య తగ్గిందని పోలీస్ కమిషనర్ వెంకటేశ్వరరావు తెలిపారు. విజయవాడలో ఆయన మాట్లాడుతూ, నగర పోలీస్ కమిషనరేట్ పరిధిలోని వాణిజ్య సంస్థలు సీసీ కెమేరాలు ఏర్పాటు చేసుకోవాలని ఆయన ఆదేశించారు. లేని పక్షంలో 5 వేల నుంచి 10 వేల వరకు జరిమానా విధిస్తామని ఆయన హెచ్చరించారు. విజయవాడలో నేరాల కట్టడికి మరిన్ని చర్యలు చేపడతామని ఆయన స్పష్టం చేశారు.