పురాణ పురుషులైన నలుడు, భీముడు గొప్ప వంటగాళ్లుగా పేరుగాంచారు. అందుకే, నేటి తరం వంటవాళ్లను నలభీములతో పోల్చుతుంటారు. ఒకప్పుడు వంటవాళ్లంటే కాస్తంత తక్కువ భావన ఉండేది. ఇప్పుడలా కాదు. వంటశాస్త్రంపై ప్రత్యేక కోర్సులు, కాలేజీలు వచ్చాయి. యువత ఈ రంగంవైపు మక్కువ చూపుతున్నారు. ముఖ్యంగా, వంటను వృత్తిగా ఎంచుకునేందుకు పురుషులు సిగ్గుపడడంలేదు. చెఫ్ గా కొంచెం పేరు తెచ్చుకుంటే లక్షల్లో వేతనాలు వారి ముంగిట వాలుతున్నాయి. వారు తయారు చేసే వంటకాలు అలాంటివి మరి. స్టార్ హోటళ్లు, ప్రముఖుల వేడుకల్లో పేరుమోసిన చెఫ్ లు తయారుచేసే వంటకాలను రుచిచూడవచ్చు.
మరి, సాధారణ వ్యక్తులు కూడా ఇకపై ఇలాంటి వెరైటీ డిషెస్ గురించి తెలుసుకోవచ్చు. ఎలాగంటారా, ఇప్పుడు చెఫ్ ల కోసం ఓ సోషల్ నెట్ వర్కింగ్ సైట్ ఏర్పాటు చేశారు. దానిపేరు ChefHost.com ఈ సైట్ ద్వారా హోస్టుల రూపంలో మామూలు వ్యక్తులు కూడా ప్రవేశించవచ్చు. తమకు నచ్చిన చెఫ్ ను వెతుక్కోవడం, క్యాటరింగ్ ఆర్డర్లు బుక్ చేయడం, కొత్త వంటకాల గురించి తెలుసుకోవడం వంటివి చేయవచ్చట.
More Telugu News
-
భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు
-
చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!
-
ఒక్క ఓవర్ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి
-
భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్
-
గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు
-
"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ
-
భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!
-
ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్
-
'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి
-
ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు
-
వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు
-
పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్
-
సౌదీలో చిక్కుకున్న ఉమ్రా యాత్రికులు.. రంగంలోకి దిగిన ప్రభుత్వాలు
-
షర్మిలకు జగన్ లేఖ.. మేనకోడలి పెళ్లికి బెంగళూరు ఇల్లు వద్దని స్పష్టీకరణ
-
పాకిస్థాన్ వల్లే కశ్మీరీలు బతుకుతున్నారు: ఫరూఖ్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు