ఢిల్లీలోని కింది స్థాయి కోర్టుల్లో జడ్జీలుగా విధులు నిర్వర్తిస్తున్న 300 మందిపై అవినీతి ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. 2013లో కంప్యూటర్లు, ల్యాప్ టాప్ ల కొనుగోళ్ల విషయంలో వీరంతా అవకతవకలకు పాల్పడ్డారన్న అంశంపై ఢిల్లీ హైకోర్టు నిఘా పెట్టింది. ఈ కేసు దర్యాప్తునకు ముగ్గురు హైకోర్టు న్యాయమూర్తులతో కూడిన అత్యున్నత స్థాయి కమిటీని ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రోహిణి ఏర్పాటు చేశారు.
దర్యాప్తులో భాగంగా ఆయా కోర్టులకు ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం, హైకోర్టులు విడుదల చేసిన నిధుల వినియోగానికి సంబంధించి ఈ కమిటీ దృష్టి సారించనుంది. కంప్యూటర్లు, ల్యాప్ టాప్ కొనుగోళ్లకు సంబంధించి ఆయా కోర్టులు అందజేసిన బిల్లులను కమిటీ క్షుణ్ణంగా పరిశీలించనుంది. కంప్యూటర్లు, ల్యాప్ టాప్ లతో పాటు ఐపాడ్ ల కొనుగోలు కోసం గతేడాది ఒక్కో కోర్టుకు రూ. 1.10 లక్షలు మంజూరయ్యాయి. కేసుల విచారణలో వేగాన్ని పెంచేందుకు ప్రభుత్వ సహకారంతో ఢిల్లీ హైకోర్టు ఈ నిధులను విడుదల చేసింది. అయితే సదరు పరికరాల కొనుగోలుకు సంబంధించి 300 మంది న్యాయమూర్తులు అవకతవకలకు పాల్పడ్డట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి.
More Telugu News
-
భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు
-
చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!
-
ఒక్క ఓవర్ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి
-
భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్
-
గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు
-
"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ
-
భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!
-
ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్
-
'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి
-
ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు
-
వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు
-
పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్
-
సౌదీలో చిక్కుకున్న ఉమ్రా యాత్రికులు.. రంగంలోకి దిగిన ప్రభుత్వాలు
-
షర్మిలకు జగన్ లేఖ.. మేనకోడలి పెళ్లికి బెంగళూరు ఇల్లు వద్దని స్పష్టీకరణ
-
పాకిస్థాన్ వల్లే కశ్మీరీలు బతుకుతున్నారు: ఫరూఖ్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు