కేంద్ర మాజీ మంత్రి మురళీ దేవరా (77) కన్నుమూశారు. గత కొంతకాలంగా కేన్సర్ వ్యాధితో బాధపడుతున్న ఆయన ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత ముంబైలో తుది శ్వాస విడిచారు. యూపీఏ హయాంలో పెట్రోలియం శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహించిన మురళీ దేవరా... గ్యాస్ పంపిణీ, బోగస్ గ్యాస్ కనెక్షన్ల ఏరివేతకు సంబంధించి పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. సబ్సిడీ గ్యాస్ సిలిండర్ల కుదింపు, గ్యాస్ కు నగదు బదిలీ వంటి పలు కీలక నిర్ణయాలు ఆయన హయాంలోనే ప్రారంభమయ్యాయి.