బెంగళూరులో తరచుగా చిన్నారులపై అత్యాచార ఘటనలు చోటుచేసుకుంటుండడం పట్ల విద్యార్థుల తల్లిదండ్రుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. స్కూలు సిబ్బందే పిల్లలపై లైంగిక దాడులు చేస్తుండడంపై బాలల హక్కుల సంఘాలు మండిపడుతున్నాయి. తాజాగా, బెంగళూరు ఆర్టీ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ పాఠశాలలో ఆరేళ్ల చిన్నారిపై ఓ ఉపాధ్యాయురాలు లైంగిక దాడికి పాల్పడిన ఘటన కలకలం రేపింది. తనపై లైంగిక దాడి జరిగిందని బాలిక నిర్ధారించిందని పోలీసులు తెలిపారు. అయితే, ఆ టీచర్ ను చిన్నారి గుర్తించాల్సి ఉందని, అప్పటిదాకా ఆమెను అరెస్టు చేయలేమని పోలీసులు పేర్కొన్నారు. శుక్రవారం నాడు ఈ ఘటన జరిగిందని, నొప్పిగా ఉందని బాలిక ఏడుస్తుండడంతో ఘటన వెలుగులోకి వచ్చిందని ఓ పోలీసు అధికారి వివరించారు.
కాగా, ఈ పాఠశాలను ఓ మహిళ నిర్వహిస్తోందని, ఆమె భర్త ఓ బేకరీ యజమాని అని తెలుస్తోంది. దీనిపై, నగర పోలీసు కమిషనర్ ఎంఎన్ రెడ్డి మాట్లాడుతూ, కేసును నిశితంగా పరిశీలిస్తున్నామని, ఇంకా ఎవరినీ అరెస్టు చేయలేదని చెప్పారు. మెడికల్ రిపోర్టు ఆధారంగా ముందుకెళతామని తెలిపారు. కాగా, శనివారం ఉదయం ఆ పాఠశాల ముందు విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. పోలీసులు రంగంలోకి దిగి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.
More Telugu News
-
భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు
-
చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!
-
ఒక్క ఓవర్ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి
-
భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్
-
గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు
-
"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ
-
భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!
-
ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్
-
'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి
-
ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు
-
వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు
-
పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్
-
సౌదీలో చిక్కుకున్న ఉమ్రా యాత్రికులు.. రంగంలోకి దిగిన ప్రభుత్వాలు
-
షర్మిలకు జగన్ లేఖ.. మేనకోడలి పెళ్లికి బెంగళూరు ఇల్లు వద్దని స్పష్టీకరణ
-
పాకిస్థాన్ వల్లే కశ్మీరీలు బతుకుతున్నారు: ఫరూఖ్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు