ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఐటీ రంగంలో భారీగా పెట్టుబడులను ఆకర్షించేందుకు ప్రయత్నిస్తుండడంతో కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలు డైలమాలో పడ్డాయి. తెలంగాణ ఉద్యమంతో ఐటీ పరిశ్రమల్లో అత్యధిక శాతం ఈ రెండు పొరుగు రాష్ట్రాలకు తరలివెళ్లాయి. ఉద్యమం పుణ్యాన కర్ణాటక, తమిళనాడు బాగానే లాభపడ్డాయి. 2004లో చంద్రబాబు అధికారం కోల్పోవడంతో సంయుక్త ఆంధ్రప్రదేశ్ లో ఐటీ రంగం పురోగతి మందగించింది. విభజన అనంతర ఎన్నికల్లో గెలిచి మళ్లీ పగ్గాలు చేపట్టిన బాబు, భారీ లక్ష్యాలను నిర్దేశించుకున్నారు.
వచ్చే ఐదేళ్లలో ఐటీ రంగంలో 2 బిలియన్ డాలర్ల పెట్టుబడులను ఆకర్షించాలని నిర్ణయించుకున్నారు. అందుకోసం, బాబు ఏపీలో పెద్ద ఎత్తున పన్ను రాయితీలను ప్రకటించడం కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల అవకాశాలను ప్రభావితం చేయనుంది. దీనిపైనే, కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జయలలిత ప్రధాని మోదీకి లేఖలు రాశారు. చంద్రబాబు అమలు చేస్తున్న పన్ను విధానం అనైతికమని వారు ప్రధానికి ఫిర్యాదు చేశారు. బాబు ఏకంగా బెంగళూరు వెళ్లి పారిశ్రామికవేత్తలు, వ్యాపారదిగ్గజాలతో చర్చలు జరపడం కూడా సిద్ధరామయ్యకు మింగుడుపడని విషయమే. బాబు దూకుడు ఇలాగే కొనసాగితే, ఐటీ పరిశ్రమలు ఏపీకి బారులు తీరడం ఖాయమని కర్ణాటక సీఎం ఆందోళన చెందుతున్నట్టు తెలుస్తోంది.
More Telugu News
-
భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు
-
చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!
-
ఒక్క ఓవర్ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి
-
భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్
-
గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు
-
"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ
-
భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!
-
ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్
-
'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి
-
ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు
-
వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు
-
పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్
-
సౌదీలో చిక్కుకున్న ఉమ్రా యాత్రికులు.. రంగంలోకి దిగిన ప్రభుత్వాలు
-
షర్మిలకు జగన్ లేఖ.. మేనకోడలి పెళ్లికి బెంగళూరు ఇల్లు వద్దని స్పష్టీకరణ
-
పాకిస్థాన్ వల్లే కశ్మీరీలు బతుకుతున్నారు: ఫరూఖ్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు