వరంగల్ జిల్లా భూపాలపల్లి ఏపీ గ్రామీణ వికాస బ్యాంకు చోరీకి పాల్పడిన బ్యాంకు అటెండర్ రమేష్ ను డీఐజీ మల్లారెడ్డి మీడియా ముందు ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా కేసును ఎలా ఛేదించింది వివరించారు. బ్యాంకు చోరీ పూర్తయిన తరువాత కేసు నమోదు చేసిన పోలీసులు, దర్యాప్తు ప్రారంభించారు. వేసిన తాళాలు వేసినట్టే ఉండగా, నగలు, నగదు మాయం కావడం వెనుక బ్యాంకు సిబ్బంది హస్తం ఉండి తీరుతుందని భావించిన పోలీసులు, వారి నుంచే దర్యాప్తు ప్రారంభించారు.
బ్యాంకు సిబ్బందిని పలుమార్లు పలు రకాలుగా ప్రశ్నించారు. బ్యాంకు సిబ్బందితో పాటు వారి కుటుంబ సభ్యులను కూడా ప్రశ్నించారు. బ్యాంకు సిబ్బంది కదలికలపై ఓ కన్నేసి ఉంచారు. దీంతో రమేష్ భార్యను ప్రశ్నిస్తే చాలా విషయాలు తెలిశాయని, ఆమె ఇచ్చిన సమాచారం ఆధారంగా కేసును ఛేదించామని ఆయన వివరించారు. 34 కేజీల బంగారం, 21 లక్షల నగదును దొంగిలించి కరీంనగర్ జిల్లా అంబటిపల్లిలోని బంధువుల ఇంట్లో దాచాడని పోలీసులు గుర్తించారు.
చోరీ సొత్తులోని 19 లక్షల రూపాయలు తీసుకుని తీర్థయాత్రలకు వెళ్లాడు. ఆమె ఇచ్చిన సమాచారం ఆధారంగా చోరీ సొత్తును స్వాధీనం చేసుకుని అతడిని అరెస్టు చేసినట్టు పోలీసులు వివరించారు. అటెండర్ చేతికి విలువైన స్ట్రాంగ్ రూం తాళాలు ఎలా వెళ్లాయనే విషయాన్ని ఆరా తీస్తున్నామని వారు తెలిపారు.
More Telugu News
-
"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ
-
భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!
-
ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్
-
'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి
-
ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు
-
వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు
-
పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్
-
సౌదీలో చిక్కుకున్న ఉమ్రా యాత్రికులు.. రంగంలోకి దిగిన ప్రభుత్వాలు
-
షర్మిలకు జగన్ లేఖ.. మేనకోడలి పెళ్లికి బెంగళూరు ఇల్లు వద్దని స్పష్టీకరణ
-
పాకిస్థాన్ వల్లే కశ్మీరీలు బతుకుతున్నారు: ఫరూఖ్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు
-
ఓ ఉబెర్ డ్రైవర్ సరికొత్త మోసం.. ఫేక్ స్క్రీన్‌షాట్‌తో రెట్టింపు చార్జీ వసూలుకు యత్నం!
-
బొత్స సత్యనారాయణకు షాక్.. బొత్స చైతన్య నామినేషన్ తిరస్కరణ
-
అతడితో మాట్లాడడం ఆపేశాక బరువు పెరిగాను: జాన్వీ కపూర్ సరదా వ్యాఖ్యలు
-
బలహీనమైన మగాడి సంతోషం కోసం మరో మహిళను అణచివేయొద్దు: ఉపాసన
-
'ధూమకేతు' (నెట్ ఫ్లిక్స్) మూవీ రివ్యూ!