శంషాబాద్ ఎయిర్ పోర్టు డొమెస్టిక్ టెర్మినల్ కు ఎన్టీఆర్ పేరును రద్దు చేయాలని తెలంగాణ అసెంబ్లీ చేసిన తీర్మానం ఎన్టీఆర్ ను అవమానపరిచేదేనని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు అన్నారు. టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు కుయుక్తులు పన్ని సదరు తీర్మానాన్ని చేశాయని ఆయన ఆరోపించారు. తెలంగాణ అసెంబ్లీ చేసిన తీర్మానానికి వ్యతిరేకంగా ఈ రోజు హైదరాబాదులోని ఎన్టీఆర్ ఘాట్ లో పార్టీ సీనియర్ నేత మోత్కుపల్లి నర్సింహులు చేపట్టిన దీక్షకు సంఘీభావం ప్రకటించిన సందర్భంగా చంద్రబాబు అసెంబ్లీ తీర్మానంపై మండిపడ్డారు.
ఎన్టీఆర్ ఏ ఒక్క ప్రాంతానికో చెందిన వ్యక్తి కాదని చెబుతూ, దేశ స్థాయిలో చక్రం తిప్పిన వ్యక్తిగా ఎన్టీఆర్ ను ఆయన అభివర్ణించారు. ప్రపంచవ్యాప్తంగా తెలుగోడి ఆత్మ గౌరవాన్ని చాటిన ఘనత ఎన్టీఆర్ దేనన్నారు. తెలుగు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన వ్యక్తిని కించపరిచే విధంగా మాట్లాడటం సరికాదన్నారు. కాంగ్రెస్ పార్టీతో రాజీలేని పోరు సాగించిన ఎన్టీఆర్, తెలుగు నేత పీవీ నరసింహారావు ప్రధాని పదవి చేపట్టే సందర్భంగా రాజకీయాలను పక్కనబెట్టి పీవీకి మద్దతు ప్రకటించారన్నారు. సీఎం కేసీఆర్, ప్రతిపక్ష నేత జానారెడ్డి, స్పీకర్ మధుసూదనాచారి తదితర వ్యక్తులందరికీ రాజకీయ భిక్ష పెట్టింది రామారావేనన్నారు.
More Telugu News
-
భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు
-
చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!
-
ఒక్క ఓవర్ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి
-
భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్
-
గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు
-
"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ
-
భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!
-
ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్
-
'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి
-
ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు
-
వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు
-
పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్
-
సౌదీలో చిక్కుకున్న ఉమ్రా యాత్రికులు.. రంగంలోకి దిగిన ప్రభుత్వాలు
-
షర్మిలకు జగన్ లేఖ.. మేనకోడలి పెళ్లికి బెంగళూరు ఇల్లు వద్దని స్పష్టీకరణ
-
పాకిస్థాన్ వల్లే కశ్మీరీలు బతుకుతున్నారు: ఫరూఖ్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు