ఈనెల 12వ తేదీ ఉదయం అరబిందో ఫార్మా వైస్ ఛైర్మన్ నిత్యానందరెడ్డిపై హత్యాయత్నం చేసిన ఓబులేసును పోలీసులు మీడియా మందు ప్రవేశపెట్టారు. ఓబులేసు ఏఆర్ కానిస్టేబుల్ గా పని చేస్తున్నాడని హైదరాబాదు నగర కమిషనర్ మహేందర్ రెడ్డి స్పష్టం చేశారు. ఓబులేసు దుర్వ్యసనాలకు బానిసై, తేలిగ్గా డబ్బును సంపాదించాలనే లక్ష్యంతో అమ్యూనియేషన్ లో ఉండే లోడెడ్ ఏకే 47 రైఫిల్ ను దొంగిలించాడని ఆయన చెప్పారు. పోలీసు ఆయుధ విభాగంలో వారానికోసారి వెపన్స్ క్లీనింగ్ చేస్తారని ఆయన తెలిపారు.
క్లీనింగ్ చేసిన ఆయుధాలను ఆయుధాగారంలో డిపాజిట్ చేస్తారు. గత డిసెంబర్ లో క్లీనింగ్ రోజున ఓబులేసు మిగిలిన యూనిట్ల వారితో కలిసి ఆయుధాగారంలోకి ప్రవేశించి, లోడెడ్ ఏకే 47 రైఫిల్ ను ఓవర్ కోట్ లోపల పెట్టుకుని వెళ్లిపోయాడు. అయితే అది వేరే యూనిట్ కి సంబంధించిన వెపన్ కావడం, సంబంధిత యూనిట్ కి మూడు రోజులు సెలవు ఉండడంతో జరిగిన దొంగతనం గుర్తించలేదు. దీనిని బ్యాగ్ లో పెట్టుకుని ఓర్వకల్లు గుట్టల్లో దాచాడు.
గత ఫిబ్రవరిలో నిజామాబాద్ కు చెందిన ఓ వ్యక్తిని గన్ తో బెదిరించి పది లక్షల రూపాయలు వసూలు చేశాడు. అలాగే డబ్బున్న వ్యక్తిని కిడ్నాప్ చేసి, డబ్బు దండుకోవాలనే లక్ష్యంతో గన్ తో ముందురోజు సాయంత్రం కేబీఆర్ పార్క్ చేరుకుని, పార్క్ బయటున్న చెట్లలో దాక్కుని తనకు కావాల్సిన వ్యక్తి కోసం ఎదురు చూశాడు. పార్క్ లో వాకింగ్ చేసేందుకు లగ్జరీ కారులో వచ్చిన నిత్యానందరెడ్డి కదలికలను గమనించి, అతని కారులోకి ఎంటరై తుపాకి చూపించి, కారును బయటికి తీయాలని బెదిరించాడు.
ఒక్కసారిగా ఆగంతుకుడ్ని చూసిన నిత్యానందరెడ్డి తుపాకీ బారెల్ ను పట్టుకుని పక్కకి నెడుతూ అరవడం ప్రారంభించాడు. నిత్యానందరెడ్డి పెనుగులాడుతాడని, పెద్దగా అరుస్తాడని ఊహించని ఓబులేసు ట్రిగ్గర్ నొక్కాడు. ఇంతలో వాకింగ్ చేస్తూ నిత్యానందరెడ్డి అరుపులు విన్న అతని సోదరుడు ప్రసాద్ రెడ్డి వచ్చి ఓబులేసును వెనుక నుంచి పట్టుకున్నాడు. దీంతో, ప్రసాద్ రెడ్డి చేయి కొరికి, నిత్యానందరెడ్డిని తోసేసి పారిపోయాడు. ఈ క్రమంలో గన్ కిందపడిపోయింది.
దీనిని ఆధారం చేసుకున్న పోలీసులు, కేసు నమోదు చేసి, పకడ్బందీగా దర్యాప్తు చేశారు. దానికి తోడు కేబీఆర్ పార్క్ బయటున్న సీసీటీవీ ఫుటేజ్ దొరకడంతో ఓబులేసు అడ్డంగా దొరికిపోయాడు. కమెండో కావడం, దాక్కోవడం (గెరిల్లా పోరాట తీరు) తెలిసిన వ్యక్తి కావడంతో పట్టుకునేందుకు కొంత సమయం తీసుకుందని పోలీసులు వెల్లడించారు.
More Telugu News
-
భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు
-
చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!
-
ఒక్క ఓవర్ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి
-
భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్
-
గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు
-
"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ
-
భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!
-
ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్
-
'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి
-
ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు
-
వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు
-
పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్
-
సౌదీలో చిక్కుకున్న ఉమ్రా యాత్రికులు.. రంగంలోకి దిగిన ప్రభుత్వాలు
-
షర్మిలకు జగన్ లేఖ.. మేనకోడలి పెళ్లికి బెంగళూరు ఇల్లు వద్దని స్పష్టీకరణ
-
పాకిస్థాన్ వల్లే కశ్మీరీలు బతుకుతున్నారు: ఫరూఖ్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు