విదేశీ పర్యటన ముగించుకుని వచ్చిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం తన బ్లాగులో పలు అంశాలను పేర్కొన్నారు. ప్రపంచం ఇప్పుడు భారత్ వైపు గొప్ప గౌరవభావం, అపారమైన ఉత్సుకతతో చూస్తోందని తెలిపారు. తన విదేశీ పర్యటన ఫలితాలను వివరిస్తూ... నల్లధనంపై పోరుకు జి20 దేశాలు బాసటగా నిలుస్తామని హామీ ఇచ్చాయన్నారు. తన 10 రోజుల పర్యటనలో 38 మంది ప్రపంచ నేతలను కలిశానని, 20 ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహించానని బ్లాగులో తెలిపారు.
ద్వైపాక్షిక భేటీల సందర్భంగా ఓ విషయం గమనించానని, అదేంటంటే, ప్రపంచం అంతా భారత్ వైపు చూస్తోందని, భారత్ తో సంబంధాల కోసం తహతహలాడుతోందని పేర్కొన్నారు. వాణిజ్య సంబంధాల బలోపేతం, భారత్ కు పెట్టుబడులను ఆకర్షించడమే ముఖ్యోద్ధేశంగా తన విదేశీ పర్యటన సాగిందన్నారు. 'మేక్ ఇన్ ఇండియా' పట్ల అనేకమంది నేతలు ఆసక్తి చూపారని మోదీ పేర్కొన్నారు. దీన్ని సానుకూల సంకేతంగా భావిస్తున్నట్టు ఆయన తన బ్లాగులో తెలిపారు.
More Telugu News
-
60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్
-
ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!
-
కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్
-
ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!
-
కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్
-
కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి
-
భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు
-
చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!
-
ఒక్క ఓవర్ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి
-
భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్
-
గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు
-
"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ
-
భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!
-
ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్
-
'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి