శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలోని డొమెస్టిక్ టెర్మినల్ కు ఎన్టీఆర్ పేరు పెడుతూ కేంద్రం తీసుకున్న నిర్ణయం తెలంగాణను కించపరిచేదేనని సీఎం కేసీఆర్ అన్నారు. శుక్రవారం అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాగానే ఈ విషయంపై చర్చకు పట్టుబట్టిన కాంగ్రెస్ సభ్యుల ఆందోళనలను సమర్థించిన అనంతరం మాట్లాడిన కేసీఆర్, రాష్ట్ర విభజన తర్వాత సీమాంధ్రకు చెందిన వ్యక్తి పేరును తెలంగాణలోని టెర్మినల్ కు పెట్టడం తమను కించపరిచినట్టేనన్నారు.
తెలంగాణలోనూ దేశానికి సేవ చేసిన ప్రముఖ నేతలున్నారని, వారిలో ఏ ఒక్కరూ కేంద్రానికి గుర్తు రాలేదా? అంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. మాజీ ప్రధాని పీవీ నరసింహారావు పేరు పెట్టినా తాము అభ్యంతరపెట్టేవారం కాదన్నారు. సమైక్య రాష్ట్రంలో తెలంగాణపై కొనసాగిన ఆంధ్రా పెత్తనం, రాష్ట్ర విభజన తర్వాత కూడా కొనసాగుతోందని కేసీఆర్ ధ్వజమెత్తారు. ఈ తరహా పెత్తనాన్ని ఇకపై ఎంతమాత్రం సహించబోమని ఆయన ప్రకటించారు. కేంద్రం నిర్ణయంపై ఉమ్మడి పోరు సాగిద్దామని విపక్షాలకు ఆయన పిలుపునిచ్చారు.
More Telugu News
-
భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు
-
చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!
-
ఒక్క ఓవర్ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి
-
భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్
-
గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు
-
"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ
-
భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!
-
ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్
-
'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి
-
ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు
-
వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు
-
పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్
-
సౌదీలో చిక్కుకున్న ఉమ్రా యాత్రికులు.. రంగంలోకి దిగిన ప్రభుత్వాలు
-
షర్మిలకు జగన్ లేఖ.. మేనకోడలి పెళ్లికి బెంగళూరు ఇల్లు వద్దని స్పష్టీకరణ
-
పాకిస్థాన్ వల్లే కశ్మీరీలు బతుకుతున్నారు: ఫరూఖ్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు