పెళ్లినాటి ప్రమాణాలు ఆ పెళ్లి తంతు వరకే పరిమితమవుతున్నాయి! నిజజీవితంలో ప్రమాణాల తాలూకు ఆచరణ కరవవుతోంది. భార్యను కంటికి రెప్పలా చూసుకుంటానన్నవాడే చిత్రహింసలు పెడుతున్నాడు! మధ్యప్రదేశ్ లోని మోవు గ్రామంలో ఓ భర్త మహాశయుడు ఆమ్లెట్ లో టమోటా వేయలేదని భార్యను చితకబాదాడు. పాపం, ఆమె గర్భవతట! కనీసం, ఆ ఇంగితం కూడా లేకుండా చేయిచేసుకున్నాడు. గాయాలపాలైన ఆ అభాగ్యురాలు ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది.
ఫర్జానా అనే ఈ అబలకు షఫిక్ తో వివాహమైంది. అప్పటి నుంచి భర్త, అత్తమామలు అదనపు కట్నం కోసం వేధించేవారట. ఆ గొడవల మధ్యే ఈ ఆమ్లెట్ రగడ చోటుచేసుకుంది. భర్త తనను కొట్టాడంటూ ఫర్జానా ఖర్గోన్ లో ఉన్న తల్లిదండ్రులకు సమాచారమిచ్చింది. వారు వెంటనే మోవు గ్రామానికి వచ్చి కుమార్తెతో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో, పోలీసులు షఫీక్ తో పాటు అతని కుటుంబ సభ్యులపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ప్రస్తుతం వారంతా పరారీలో ఉన్నారు.
More Telugu News
-
భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు
-
చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!
-
ఒక్క ఓవర్ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి
-
భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్
-
గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు
-
"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ
-
భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!
-
ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్
-
'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి
-
ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు
-
వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు
-
పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్
-
సౌదీలో చిక్కుకున్న ఉమ్రా యాత్రికులు.. రంగంలోకి దిగిన ప్రభుత్వాలు
-
షర్మిలకు జగన్ లేఖ.. మేనకోడలి పెళ్లికి బెంగళూరు ఇల్లు వద్దని స్పష్టీకరణ
-
పాకిస్థాన్ వల్లే కశ్మీరీలు బతుకుతున్నారు: ఫరూఖ్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు