తెలంగాణ శాసనసభలో టీడీపీ ఉప నేత రేవంత్ రెడ్డి గురువారం ఆసెంబ్లీలోని తమ పార్టీ కార్యాలయంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. టీఆర్ఎస్ లో తన ప్రస్థానంపై ఆయన వినిపించిన కొత్త వాదనకు మీడియా మిత్రులు విస్తుపోయారు. గురువారం నాటి అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా సీఎం కేసీఆర్, రేవంత్ పై పరోక్షంగానే అయినా కాస్త కటువుగా వ్యవహరించారు. ఆ తర్వాత పార్టీ కార్యాలయంలో కూర్చున్న రేవంత్ వద్ద విలేకరులు ఇదే అంశాన్ని ప్రస్తావిస్తూ, మీరూ ఒకప్పుడు టీఆర్ఎస్ నేతే కదా? అనగానే ఒక్కసారిగా రేవంత్ హుషారయ్యారు.
తాను ఎంతమాత్రం టీఆర్ఎస్ వ్యక్తిని కాదని, తాను ముమ్మాటికీ టీడీపీ నేతనేనని వ్యాఖ్యానించారు. దీనికోసం ఆయన ఓ పిట్ట కథను వినిపించారు. హైదరాబాద్ నుంచి రైల్లో ఢిల్లీ వెళుతుండగా, నీటి కోసం లక్నోలో దిగినంత మాత్రాన ఆ నగరం మనది కాదని ఆయన అన్నారు. అలాగే ఎక్కడికి వెళ్లినా మనది హైదరాబాదేనని, ఎన్ని చోట్ల ఆగినా అంతిమంగా ఢిల్లీ చేరిన తర్వాతే రైలు దిగుతామని రేవంత్ చెప్పారు. తాను కూడా లక్నోలో ఆగిన మాదిరిగా టీఆర్ఎస్ లో కొన్నాళ్లు ఉన్నానన్నారు. అంతమాత్రాన తాను టీఆర్ఎస్ వ్యక్తిని ఎలా అవుతానంటూ ఎదురు ప్రశ్నించారు. రేవంత్ వాదనతో నోరెళ్లబెట్టిన మీడియా మిత్రులు ఆ తర్వాత చిన్నగా అక్కడి నుంచి జారుకున్నారు.
More Telugu News
-
"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ
-
భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!
-
ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్
-
'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి
-
ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు
-
వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు
-
పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్
-
సౌదీలో చిక్కుకున్న ఉమ్రా యాత్రికులు.. రంగంలోకి దిగిన ప్రభుత్వాలు
-
షర్మిలకు జగన్ లేఖ.. మేనకోడలి పెళ్లికి బెంగళూరు ఇల్లు వద్దని స్పష్టీకరణ
-
పాకిస్థాన్ వల్లే కశ్మీరీలు బతుకుతున్నారు: ఫరూఖ్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు
-
ఓ ఉబెర్ డ్రైవర్ సరికొత్త మోసం.. ఫేక్ స్క్రీన్‌షాట్‌తో రెట్టింపు చార్జీ వసూలుకు యత్నం!
-
బొత్స సత్యనారాయణకు షాక్.. బొత్స చైతన్య నామినేషన్ తిరస్కరణ
-
అతడితో మాట్లాడడం ఆపేశాక బరువు పెరిగాను: జాన్వీ కపూర్ సరదా వ్యాఖ్యలు
-
బలహీనమైన మగాడి సంతోషం కోసం మరో మహిళను అణచివేయొద్దు: ఉపాసన
-
'ధూమకేతు' (నెట్ ఫ్లిక్స్) మూవీ రివ్యూ!