ఆసియాలోకెల్లా అత్యంత పరిశుభ్రమైన గ్రామం భారత్ లో ఉంది. ఆ గ్రామం మేఘాలయలో ఉంది. పేరు మాలిన్నోంగ్. ఈ గ్రామ జనాభా 530. ఇక్కడ ప్రతి ఇంటికి టాయిలెట్లు, వ్యర్థాలు వేసేందుకు ప్రతి రహదారి పక్కన వెదురు బుట్టలు ఉంటాయట. ఇక, గ్రామంలోని విద్యార్థులు తమ పాఠశాల పరిసరాలను ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచుతారు. మాలిన్నోంగ్ గ్రామస్థులు శుభ్రతను జీవితంలో ఓ భాగంగా పాటిస్తున్నారు.
ఇటీవల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 'స్వచ్ఛ భారత్' కార్యక్రమం చేపట్టిన సంగతి తెలిసిందే. దాంతో, ప్రతి ఒక్కరూ గ్రామాల్లో, నగరాల్లో ఈ కార్యక్రమాన్ని అనుసరిస్తూ కొద్దికొద్దిగా శుభ్రం చేస్తున్నారు. కానీ, ఎప్పటినుంచో ఈ గ్రామంలో పరిశుభ్రతను విధిగా పాటిస్తున్నారని ఇండియా డిస్కవరీ మ్యాగజైన్ తెలిపింది. దాంతో, 2003లోనే "ఆసియా అత్యంత శుభ్రమైన గ్రామం"గా మాలిన్నోంగ్ ఎంపికైంది.
2007లో గ్రామంలో బహిరంగంగా మల విసర్జనకు వెళ్లే పద్ధతి నిర్మూలించి, ఉన్న 91 ఇళ్లకు 'నిర్మల భారత్ అభియాన్' కింద అందరికీ మరుగుదొడ్లు కట్టించారు. ఈ సందర్భంగా ఓ గ్రామస్థుడు మాట్లాడుతూ, "నా చిన్నతనం నుంచి ఈ గ్రామం పరిశుభ్రంగా ఉండేది. మా అమ్మమ్మ వాళ్ల కాలంలో అలా ఉందని విన్నాం. శుభ్రంగా ఉంచడం ఇక్కడి ప్రతి ఒక్కరి బాధ్యత" అని తెలిపాడు.
More Telugu News
-
భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు
-
చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!
-
ఒక్క ఓవర్ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి
-
భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్
-
గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు
-
"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ
-
భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!
-
ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్
-
'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి
-
ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు
-
వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు
-
పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్
-
సౌదీలో చిక్కుకున్న ఉమ్రా యాత్రికులు.. రంగంలోకి దిగిన ప్రభుత్వాలు
-
షర్మిలకు జగన్ లేఖ.. మేనకోడలి పెళ్లికి బెంగళూరు ఇల్లు వద్దని స్పష్టీకరణ
-
పాకిస్థాన్ వల్లే కశ్మీరీలు బతుకుతున్నారు: ఫరూఖ్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు