నిజామాబాద్ జిల్లాకు చెందిన ఉపాధ్యాయుడు ఆచార్య ప్రపంచంలోనే అతిపెద్ద కలాన్ని తయారు చేసి గిన్నిస్ బుక్ రికార్డును అందుకున్నారు. గురువారం నాడు హైదరాబాదులోని ప్రెస్ క్లబ్ లో ఈ కలాన్ని ప్రదర్శించగా గిన్నిస్ బుక్ ప్రతినిధులు హాజరై ఆయనకు ధ్రువపత్రాన్ని అందించారు. పలువురు ప్రముఖులు ఈ పెన్నును పరిశీలించి ఆచార్యను అభినందించారు.