నల్లధనంపై మోదీ సర్కారు చేస్తున్న భారీ ప్రచారం ఊకదంపుడు ఉపన్యాసమేనా? అవుననే అంటున్నారు హెచ్ఎస్ బీసీ మాజీ ఉద్యోగి, ఫ్రాన్స్ దేశస్థుడు హెర్వ్ ఫాల్సియాని. నల్లధనం సమాచారానికి సంబంధించి భారత్ వద్ద ఉన్న సమాచారం ఒక్కశాతం మాత్రమేనని ఆయన ప్రకటించారు. దేశీయ వార్తా ఛానెల్ ఎన్డీటీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ బాంబు పేల్చాడు.
హెచ్ఎస్ బీసీ లో ఉద్యోగం మానేస్తున్న సందర్భంగా సదరు బ్యాంకులో వివిధ దేశాలకు చెందిన రాజకీయ వేత్తలు, వ్యాపారులు రహస్యంగా నిర్వహిస్తున్న పలు ఖాతాల సమాచారాన్ని ఆయన తన వెంట తీసుకొచ్చారు. ఇందులో భారత్ కు చెందిన 600 ఖాతాలున్నాయి. "నల్లధనానికి సంబంధించి భారత్ వద్ద ఉన్న సమాచారం కంటే నా వద్ద వెయ్యి రెట్ల సమాచారం ఉంది. ఇతర దేశాలకు సహకరిస్తున్న మాదిరిగానే భారత్ కు సహకరించేందుకు కూడా సిద్ధంగానే ఉన్నాను" అని ఫాల్సియాని ప్రకటించారు. మరి ఆయన వద్ద ఉన్న సమాచారం కూడా అందితే దేశంలో మరెంత మంది నల్ల కుబేరులు బయటకొస్తారో!
More Telugu News
-
భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు
-
చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!
-
ఒక్క ఓవర్ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి
-
భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్
-
గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు
-
"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ
-
భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!
-
ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్
-
'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి
-
ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు
-
వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు
-
పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్
-
సౌదీలో చిక్కుకున్న ఉమ్రా యాత్రికులు.. రంగంలోకి దిగిన ప్రభుత్వాలు
-
షర్మిలకు జగన్ లేఖ.. మేనకోడలి పెళ్లికి బెంగళూరు ఇల్లు వద్దని స్పష్టీకరణ
-
పాకిస్థాన్ వల్లే కశ్మీరీలు బతుకుతున్నారు: ఫరూఖ్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు