దాదాపు రెండు నెలల తరువాత ఏఐఏడీఎంకే అధినేత్రి జయలలిత పార్టీ పనుల్లో నిమగ్నమయ్యారు. 2016 అసెంబ్లీ ఎన్నికలకు పార్టీని ఇప్పటినుంచే పునరుద్ధరించి, బలోపేతం చేసేందుకు చర్యలు చేపట్టనున్నారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో దోషిగా నిర్ధారణవడం, దాంతో శిక్షపడి జైలుకు వెళ్లడం, మళ్లీ బయటకు రావడం... ఈ క్రమంలో ఎమ్మెల్యేగా అర్హత కోల్పోవడం, భవిష్యత్ ఎన్నికల్లో పొటీచేసే అవకాశం లేకపోవడం జరిగాయి. దాంతో, పార్టీలో తన స్థానాన్ని పటిష్ఠపరుచుకుని, అన్నాడీఎంకే అధినేత్రిగా చక్రం తిప్పనున్నారు.
ఈ నేపథ్యంలో పార్టీకి సంబంధించిన పన్నెండు నగరపాలక సంస్థల్లో పార్టీ యంత్రాంగాన్ని పునర్వ్యవస్థీకరించనున్నారు. కొన్ని జిల్లాలోనూ కేంద్ర స్థాయిలో ఇలాంటి పునర్నిర్మాణాన్ని చేపట్టనున్నారట. తొలి దశలో భాగంగా, తిరువన్నామలై, విల్లుపురం, ధర్మపురి, తంజావూరు వంటి జిల్లాల్లో రెండుగా విభజించిన యూనియన్లను ఎన్నుకుని పునరుద్ధరణ పనులు చేపట్టాలనుకుంటున్నారని సమాచారం.
2008 నుంచి తమ పార్టీ అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎలాంటి పునురుద్ధరణ జరగలేదని అన్నాడీఎంకే సీనియర్ ఒకరు అంటున్నారు. కానీ, ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పార్టీ పునఃవ్యవస్థీకరణ చేపట్టాలని తమ అధినేత్రి
నిర్ణయించారని సంతోషంగా చెబుతున్నారు.
More Telugu News
-
భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు
-
చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!
-
ఒక్క ఓవర్ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి
-
భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్
-
గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు
-
"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ
-
భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!
-
ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్
-
'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి
-
ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు
-
వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు
-
పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్
-
సౌదీలో చిక్కుకున్న ఉమ్రా యాత్రికులు.. రంగంలోకి దిగిన ప్రభుత్వాలు
-
షర్మిలకు జగన్ లేఖ.. మేనకోడలి పెళ్లికి బెంగళూరు ఇల్లు వద్దని స్పష్టీకరణ
-
పాకిస్థాన్ వల్లే కశ్మీరీలు బతుకుతున్నారు: ఫరూఖ్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు