ఎబోలా వైరస్ సోకిన వారిని గుర్తించేందుకు విమానాశ్రయాలలో మరిన్ని ఏర్పాట్లు చేస్తున్నట్టు ప్రభుత్వం వెల్లడించింది. ఇందుకోసం ముగ్గురు సభ్యులతో కూడిన కమిటీని నియమించినట్టు కేంద్ర ఆరోగ్య శాఖా మంత్రి జేపీ నద్దా వెల్లడించారు. ఇండియాలోకి ఎబోలా వైరస్ రావటం కొంత ఆందోళన కలిగిస్తున్నప్పటికీ, పరిస్థితి నియంత్రణలోనే ఉందని ఆయన అన్నారు. అనుభవజ్ఞులైన డాక్టర్ల బృందం అన్ని ప్రధాన నగరాల్లో పర్యటించి ఎబోలా రోగులకు చేయాల్సిన చికిత్స, ఆసుపత్రులలో తీసుకోవాల్సిన చర్యలపై సూచనలు అందించనున్నారని తెలిపారు.
కాగా, లైబీరియా నుంచి ఢిల్లీ వచ్చిన 26 సంవత్సరాల యువకుడికి ఎబోలా వైరస్ సోకినట్టు ఎయిర్ పోర్ట్ అధికారులు కనుగొన్న సంగతి తెలిసిందే. విదేశాల నుంచి వచ్చేవారు ఎవరైనా వారి 21 రోజుల ప్రయాణ చరిత్రను అధికారులు పరిశీలిస్తారని, ఆ తరువాత ఎబోలా పరీక్షలు నిర్వహించిన మీదటే బయటకు పంపుతారని తెలిపారు.
More Telugu News
-
కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి
-
భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు
-
చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!
-
ఒక్క ఓవర్ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి
-
భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్
-
గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు
-
"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ
-
భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!
-
ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్
-
'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి
-
ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు
-
వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు
-
పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్
-
సౌదీలో చిక్కుకున్న ఉమ్రా యాత్రికులు.. రంగంలోకి దిగిన ప్రభుత్వాలు
-
షర్మిలకు జగన్ లేఖ.. మేనకోడలి పెళ్లికి బెంగళూరు ఇల్లు వద్దని స్పష్టీకరణ