నిన్న హైదరాబాదులోని కేబీఆర్ పార్క్ వద్ద అరబిందో ఫార్మా వైస్ ప్రెసిడెంట్ నిత్యానందరెడ్డిపై ఏకే47తో కాల్పులు జరిపిన కేసులో... ఏఆర్ కానిస్టేబుల్ ఓబులేష్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం అతడిని పోలీసులు విచారిస్తున్నారు. నిందితుడు ఓబులేష్ వెనుక పెద్ద చరిత్రే ఉంది.
హైదరాబాద్ అంబర్ పేటలోని సీపీఎల్ గ్రౌండ్ లో ఏఆర్ కానిస్టేబుల్ గా పనిచేస్తున్న ఓబులేష్... మొదట కర్నూలు ఏపీఎస్పీ ఏఆర్ కానిస్టేబుల్ గా డిపార్ట్ మెంట్ లో చేరాడు. నాలుగేళ్ల తర్వాత హైదరాబాద్ గ్రేహౌండ్స్ కు బదిలీ అయ్యాడు. గ్రేహౌండ్స్ విధుల్లో భాగంగా విశాఖ ఏజన్సీలో మావోయిస్టుల ఏరివేత కోసం కూంబింగ్ కు వెళ్లాడు. కూంబింగ్ పూర్తయిన తర్వాత హైదరాబాద్ తిరిగి వస్తున్న సమయంలో ఓబులేష్ కు చెందిన ఏకే47 తుపాకీ విజయవాడలో మాయమైంది. అయితే ఈ విషయాన్ని ఓబులేష్ ఉన్నతాధికారులకు తెలపలేదు. ఆ తర్వాత ఏకే47 మిస్ అయినట్టు అధికారుల తనిఖీల్లో తేలింది. ఈ విషయం బయటకు పొక్కితే రచ్చరచ్చ అవుతుందని భావించిన పోలీస్ ఉన్నతాధికారులు చడీచప్పుడు లేకుండా, ఓబులేష్ ను అంబర్ పేట్ సీపీఎల్ కు బదిలీ చేశారు.
అయితే మిస్ అయిందని అందరూ భావిస్తున్న ఏకే47 ఓబులేష్ దగ్గరే ఉంది. తన దగ్గర శక్తిమంతమైన ఆయుధం ఉండటంతో ఓబులేష్ పలు విధాలుగా ఆలోచించాడు. పక్కా ప్లాన్ తయారుచేసుకుని... ఎక్కువ మొత్తంలో డబ్బు సంపాదించేందుకు రెడీ అయ్యాడు. ధనవంతులను కిడ్నాప్ చేసి కోట్ల రూపాయలను సంపాదించాలని స్కెచ్ వేశాడు. ఇందులో భాగంగానే అరబిందో ఫార్మా వైస్ ప్రెసిడెంట్ నిత్యానందరెడ్డిని కిడ్నాప్ చేయబోయి అడ్డంగా బుక్ అయ్యాడు. గతంలో కూడా ఓ కిడ్నాప్ వ్యవహారంలో లక్షల రూపాయలు సంపాదించాడని తెలుస్తోంది. ప్రస్తుతం ఓబులేష్ ను పోలీసులు విచారిస్తున్నారు. కేబీఆర్ పార్క్ కాల్పుల ఘటనతో పాటు, పాత కిడ్నాప్ వ్యవహారంలో కూడా ఓబులేష్ పై విచారణ కొనసాగుతోంది.
More Telugu News
-
భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు
-
చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!
-
ఒక్క ఓవర్ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి
-
భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్
-
గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు
-
"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ
-
భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!
-
ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్
-
'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి
-
ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు
-
వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు
-
పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్
-
సౌదీలో చిక్కుకున్న ఉమ్రా యాత్రికులు.. రంగంలోకి దిగిన ప్రభుత్వాలు
-
షర్మిలకు జగన్ లేఖ.. మేనకోడలి పెళ్లికి బెంగళూరు ఇల్లు వద్దని స్పష్టీకరణ
-
పాకిస్థాన్ వల్లే కశ్మీరీలు బతుకుతున్నారు: ఫరూఖ్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు