మొబైల్ ఫోన్ల వ్యాపారాన్ని సాఫ్ట్ వేర్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ కు విక్రయించిన నోకియా మళ్లీ తెరపైకి వచ్చింది. సొంత బ్రాండ్ నేమ్ తో ఎన్1 ట్యాబ్లెట్ ను తీసుకువస్తోంది. మైక్రోసాఫ్ట్ సంస్థ స్మార్ట్ ఫోన్లపై నోకియా పేరు తొలగించిన కొద్ది వారాలకే ఈ ఫిన్ లాండ్ దిగ్గజం తాజా ప్రొడక్ట్ తో ఉనికిని చాటుకునేందుకు సిద్ధమైంది. 7.9 అంగుళాల తెర కలిగిన నోకియా ఎన్1 చూసేందుకు యాపిల్ ఐపాడ్ ఎయిర్ మాదిరే కనిపిస్తుంది. స్క్రీన్ కు గొరిల్లా గ్లాస్ రక్షణ ఏర్పాటు చేశారు. ఆండ్రాయిడ్ లాలిపాప్ ఓఎస్ పై కూడా ఇది పనిచేస్తుంది. అయితే, నోకియా జెడ్ లాంచర్ ప్రధాన ఆపరేటింగ్ సిస్టం. 2.3 గిగాహెర్ట్జ్ ఇంటెల్ 64 బిట్ ఆటమ్ జెడ్ 3580 ప్రాసెసర్ తో పనిచేసే ఎన్1 ట్యాబ్ 32 జీబీ ఇంటర్నల్ స్టోరేజి కెపాసిటీ కలిగి ఉంటుంది. 8 ఎంపీ రియర్ కెమెరా, 5 ఎంపీ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా దీని ప్రత్యేకతలు.
తొలుత ఈ ట్యాట్ ను చైనాలో ప్రవేశపెట్టాలని నోకియా భావిస్తోంది. చైనాలో దీనిని 249 డాలర్ల (రూ.15677)కు విక్రయించాలని భావిస్తున్నారు. అటుపై, రష్యాలో లాంచ్ చేయడం ద్వారా యూరప్ మార్కెట్లోనూ ఎన్1ను ప్రవేశపెట్టాలని నోకియా వర్గాలు యోచిస్తున్నాయి.
More Telugu News
-
భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు
-
చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!
-
ఒక్క ఓవర్ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి
-
భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్
-
గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు
-
"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ
-
భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!
-
ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్
-
'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి
-
ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు
-
వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు
-
పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్
-
సౌదీలో చిక్కుకున్న ఉమ్రా యాత్రికులు.. రంగంలోకి దిగిన ప్రభుత్వాలు
-
షర్మిలకు జగన్ లేఖ.. మేనకోడలి పెళ్లికి బెంగళూరు ఇల్లు వద్దని స్పష్టీకరణ
-
పాకిస్థాన్ వల్లే కశ్మీరీలు బతుకుతున్నారు: ఫరూఖ్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు