మహారాష్ట్రలో స్థిరమైన ప్రభుత్వం ఉండేలా చూడాల్సిన బాధ్యత తమది కాదని ఎన్సీపీ అధినేత శరద్ పవార్ వ్యాఖ్యానించారు. కార్యకర్తలు మధ్యంతర ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు. 'మహా'లో ఐదేళ్ళపాటు బీజేపీ ప్రభుత్వం ఉంటుందని తాను అనుకోవడం లేదని ఆయన అన్నారు. రాయఘడ్ సమీపంలో జరుగుతున్న పార్టీ కార్యకర్తల రెండు రోజుల సమావేశాల్లో ఆయన ప్రసంగించారు. రాష్ట్రంలో ఎంఐఎం పార్టీ పెరుగుదల వెనుక కొందరు బీజేపీ నేతల ప్రమేయం కూడా ఉందని ఆయన విమర్శించారు.