బుర్ద్వాన్ పేలుడు నిందితుడు హైదరాబాదులో అరెస్టయ్యాడు. ఈ పేలుళ్లకు మయన్మార్ కు చెందిన ఖలీద్ కారకుడని నిర్ధారించుకున్న జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) పోలీసులు అతడి కోసం వేట సాగించారు. చివరకు అతడిని ఈరోజు హైదరాబాదులో అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా అతడి వద్ద నుంచి బాంబుల తయారీ సామగ్రితో బాటు పలు వీడియోలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
బుర్ద్వాన్ పేలుళ్ల తర్వాత హైదరాబాదుకు మకాం మార్చిన ఖలీద్, తన పాత ప్రవృత్తిని మాత్రం వదలలేదు. అరెస్ట్ సందర్భంగా అతడి వద్ద లభించిన బాంబు తయారీ సామగ్రిని చూసిన పోలీసులు, ఒక్కసారిగా షాక్ కు గురైనట్లు సమాచారం. హైదరాబాదులోనూ పేలుళ్లకు ఖలీద్ ప్రణాళికలు రచించాడా? అన్న కోణంలో దర్యాప్తు సాగిస్తున్నారు. ఖలీద్ కు ఇసిస్ ఉగ్రవాదులతో పాటు బంగ్లాదేశ్ తీవ్రవాద సంస్థలతోనూ సంబంధాలున్నట్లు సమాచారం.
హైదరాబాదులో పట్టుబడిన ఖలీద్ ను పోలీసులు ఢిల్లీకి తరలిస్తున్నారు. పశ్చిమ బెంగాల్ లోని బుర్ద్వాన్ లో ఓ ఇంటిని అద్దెకు తీసుకుని బాంబులు తయారు చేస్తుండగా, ప్రమాదవశాత్తు బాంబులు పేలిన సంగతి తెలిసిందే.
More Telugu News
-
"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ
-
భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!
-
ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్
-
'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి
-
ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు
-
వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు
-
పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్
-
సౌదీలో చిక్కుకున్న ఉమ్రా యాత్రికులు.. రంగంలోకి దిగిన ప్రభుత్వాలు
-
షర్మిలకు జగన్ లేఖ.. మేనకోడలి పెళ్లికి బెంగళూరు ఇల్లు వద్దని స్పష్టీకరణ
-
పాకిస్థాన్ వల్లే కశ్మీరీలు బతుకుతున్నారు: ఫరూఖ్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు
-
ఓ ఉబెర్ డ్రైవర్ సరికొత్త మోసం.. ఫేక్ స్క్రీన్‌షాట్‌తో రెట్టింపు చార్జీ వసూలుకు యత్నం!
-
బొత్స సత్యనారాయణకు షాక్.. బొత్స చైతన్య నామినేషన్ తిరస్కరణ
-
అతడితో మాట్లాడడం ఆపేశాక బరువు పెరిగాను: జాన్వీ కపూర్ సరదా వ్యాఖ్యలు
-
బలహీనమైన మగాడి సంతోషం కోసం మరో మహిళను అణచివేయొద్దు: ఉపాసన
-
'ధూమకేతు' (నెట్ ఫ్లిక్స్) మూవీ రివ్యూ!