భారత్ పై పాకిస్తానీల వైఖరికి ఇది నిదర్శనం! వచ్చేవారం (నవంబర్ 26-27) నేపాల్ రాజధాని ఖాట్మండులో సార్క్ సదస్సు జరగనుంది. ఈ సమావేశానికి పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ కూడా వస్తున్నారు. సమావేశం కోసం ఖాట్మండు వచ్చే దేశాధినేతలకు బుల్లెట్ ప్రూఫ్ కార్లను భారత్ సమకూర్చుతోంది. ఈ క్రమంలో షరీఫ్ కు కూడా బుల్లెట్ ప్రూఫ్ కారు ఆఫర్ చేశారు. అయితే, ఆయన తిరస్కరించారట. షరీఫ్ సొంతకారు తెచ్చుకుంటామని చెప్పారని నేపాల్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి ఖగనాథ్ అధికారి తెలిపారు.