సోషల్ మీడియాలో ఫేస్ బుక్ ప్రముఖమైనది. అనుసంధాన నెట్ వర్క్ గా పేరుగాంచిన ఫేస్ బుక్ నుంచి మరో వెబ్ సైట్ వస్తోంది. దీన్ని ప్రత్యేక ప్రయోజనాల కోసం ప్రవేశపెడుతున్నారు. దీని పేరు 'ఫేస్ బుక్ ఎట్ వర్క్'. ఉద్యోగుల కోసం తీసుకువస్తున్న ఈ సైట్ ద్వారా సహోద్యోగులతో ఛాటింగ్ చేయడానికి, డాక్యుమెంట్లు షేర్ చేసుకోవడానికి వీలవుతుంది. ఈ నూతన వెబ్ సైట్ సాయంతో భద్రతతో కూడిన కార్యకలాపాలు నిర్వహించుకోవచ్చని తెలుస్తోంది.