తెలంగాణ శాసన సభ రేపటికి వాయిదా పడింది. రెండుసార్లు వాయిదా అనంతరం ప్రారంభమైన సభలో కాంగ్రెస్ తన పట్టు వీడలేదు. పార్టీ ఫిరాయింపులపై చర్చించి తీరాల్సిందేనని వాదించింది. చర్చకోసం ఆ పార్టీ సభ్యులు సభలో నినాదాలు కొనసాగించారు. సభా కార్యకలాపాలకు సహకరించాలని స్పీకర్ చేసిన అభ్యర్థనలను కూడా వారు పట్టించుకోలేదు. దీంతో సభను రేపటికి వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ మధుసూదనాచారి ప్రకటించారు.