ఏపీ సీఎం చంద్రబాబునాయుడు నేడు విశాఖపట్నంలో పర్యటించనున్నారు. ఉదయం ప్రత్యేక విమానంలో విశాఖ చేరుకోనున్న సీఎం రాత్రి దాకా నిర్విరామంగా పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఉదయం 11 గంటలకు మొదలయ్యే సీఎం పర్యటన రాత్రి 8.30 గంటల దాకా కొనసాగనుంది. 11 గంటలకు నగరంలోని ఎంవీపీ కాలనీలో సామూహిక మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొననున్న చంద్రబాబు, అక్కడే వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారు. మధ్యాహ్నం 12.30 గంలకు కైలాసగిరి చేరుకుని కార్తీక వన మహోత్సవాల్లో పాలుపంచుకుంటారు. దాదాపు రెండు గంటలకు పైగా అక్కడే గడపనున్న చంద్రబాబు అధికారులు, ప్రజలు, ప్రజాప్రతినిధులతో కలిసి సహపంక్తి భోజనం చేయనున్నారు.
అనంతరం మధ్యాహ్నం 3 గంటలకు కలెక్టరేట్ లో తుపాను నష్టాలు, పరిహారం పంపిణీకి సంబంధించి అధికారులతో సమీక్షిస్తారు. సాయంత్రం 4.30 గంటలకు కలెక్టరేట్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడతారు. సాయంత్రం 5.30 గంటలకు గురజాడ కళాక్షేత్రంలో క్రిస్టియన్ సంఘాలు ఏర్పాటు చేసిన 'థ్యాంక్స్ గివింగ్' సమావేశంలో పాల్గొంటారు. అనంతరం ఆర్ కే బీచ్ లో పర్యాటక శాఖ ఆధ్వర్యంలో ‘రిజువనేషన్ విశాఖ’ కార్యక్రమానికి సాయంత్రం 6 గంటలకు హాజరవుతారు. 6.40 గంటలకు వుడా పార్కులో సహాయ, పునరావాస కార్యక్రమాల్లో పాల్గొన్న సిబ్బందికి సన్మాన కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం అక్కడే వారితో కలిసి ఆయన సహపంక్తి భోజనం చేసి రాత్రి 8.30 గంటలకు తిరిగి హైదరాబాద్ బయలుదేరుతారు.
More Telugu News
-
భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు
-
చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!
-
ఒక్క ఓవర్ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి
-
భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్
-
గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు
-
"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ
-
భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!
-
ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్
-
'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి
-
ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు
-
వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు
-
పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్
-
సౌదీలో చిక్కుకున్న ఉమ్రా యాత్రికులు.. రంగంలోకి దిగిన ప్రభుత్వాలు
-
షర్మిలకు జగన్ లేఖ.. మేనకోడలి పెళ్లికి బెంగళూరు ఇల్లు వద్దని స్పష్టీకరణ
-
పాకిస్థాన్ వల్లే కశ్మీరీలు బతుకుతున్నారు: ఫరూఖ్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు