Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

లైబ్రరీలోకి అమ్మాయిలకు అనుమతి నిరాకరణపై మంత్రి స్మృతి ఇరానీ ఆగ్రహం

అమ్మాయిలను లైబ్రరీలోకి అనుమతిస్తే అబ్బాయిలు పోటెత్తుతారని అలీగఢ్ ముస్లిం యూనివర్శిటీ (ఏఎంయూ) వైస్ చాన్సలర్ జమీరుద్దీన్ షా చేసిన వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన వ్యాఖ్యలు అమ్మాయిలను కించపరిచేవిగా ఉన్నాయని అన్నారు. ఢిల్లీలో ఓ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ, విద్యతోపాటు రాజ్యాంగ హక్కులన్నీ అందరికీ సమానమేనని అన్నారు. దీనిపై కేంద్ర మానవ వనరుల శాఖ జమీరుద్దీన్ షాను వివరణ కోరింది.

More Telugu News