Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

'మేరు క్యాబ్' ఆఫీస్ పై డ్రైవర్ల దాడి... శంషాబాద్ విమానాశ్రయంలో ఉద్రిక్తత

కనీస వేతనాలు అందించకుండా 'మేరు క్యాబ్' యాజమాన్యం వేధింపులకు గురి చేస్తోందని ఆరోపిస్తూ డ్రైవర్లు సోమవారం ఆందోళనకు దిగారు. సంస్థ కార్యాలయంపై డ్రైవర్లు దాడికి దిగారు. ఈ నేపథ్యంలో, శంషాబాద్ విమానాశ్రయంలో సోమవారం ఉదయం ఉద్రిక్త వాతావరణం నెలకొంది. డ్రైవర్ల ఆందోళన నేపథ్యంలో వందలాది క్యాబ్ లు నిలిచిపోయాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

More Telugu News