కరెంట్ అంటే షాప్ లో దొరికే వస్తువు కాదు: కేసీఆర్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

కరెంట్ అంటే షాప్ లో దొరికే వస్తువు కాదు: కేసీఆర్

ఎన్నికల ముందు తాను 107 బహిరంగ సభల్లో పాల్గొన్నానని, 87 సభల్లో తెలంగాణ రాష్ట్రంలో దాదాపు మూడేళ్లు పాటు కరెంట్ కష్టాలుంటాయని చెప్పానని కేసీఆర్ మీర్ పేట్ సభలో గుర్తుచేశారు. కరెంట్ అంటే షాప్ లో దొరికే వస్తువు కాదని... కొత్త లైన్లు వేయాలంటే సంవత్సరాలు పడుతుందని ఆయన అన్నారు. మూడేళ్ల తర్వాత కనురెప్ప కొట్టేంత సమయం కూడా కరెంట్ పోదని కేసీఆర్ హామీ ఇచ్చారు. ఇప్పటికే 14 వేల మెగావాట్ల విద్యుత్ కోసం కొనుగోలు ఒప్పందాలు చేసుకున్నామని ఆయన తెలిపారు. తెలంగాణలో కరెంట్ పాపం తొమ్మిదేళ్లు పాలించిన టీడీపీ, పదేళ్లు పాలించిన కాంగ్రెస్ ల దేనని ఆయన ఆరోపించారు. అతి త్వరలో, విద్యుత్ విషయంలో తెలంగాణ రాష్ట్రాన్ని సర్ ప్లస్ స్టేట్ గా తీర్చిదిద్దుతామని ఆయన ప్రకటించారు.

More Telugu News