ఏపీ సీఎం చంద్రబాబునాయుడు మరోమారు ఏపీ సీఈఓగా వ్యవహరించేందుకు రంగం సిద్ధమైంది. నవంబర్, డిసెంబర్ మాసాల్లో జపాన్, చైనా, దక్షిణ కొరియా దేశాల్లో జరపనున్న పర్యటనను ఆయన ఇందుకు వేదికగా మలచుకుంటున్నారు. ఆ దేశాల్లో తన పర్యటన సందర్భంగా ప్రముఖ పారిశ్రామిక వేత్తలతో సమావేశాల ఏర్పాటు, ఏపీలోని అవకాశాలను అక్కడి పారిశ్రామిక వేత్తలకు వివరించడం, తద్వారా రాష్ట్రానికి భారీ పెట్టుబడులను సాధించే బృహత్తర బాధ్యతను చంద్రబాబు, గతంలో మాదిరే ప్రముఖ కన్సల్టింగ్ సంస్థ ప్రైస్ వాటర్ హౌస్ కూపర్స్ కు అప్పజెప్పారు.
ఇందుకోసం ఏపీ సర్కారు ఆ సంస్థకు రూ.47 లక్షలను కన్సల్టింగ్ ఫీజుగా చెల్లించనుంది. ఈ మేరకు ఆ సంస్థతో చంద్రబాబు ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. ఇప్పటికే ప్రైస్ వాటర్ రంగంలోకి దిగింది. రాష్ట్రంలో అందుబాటులోకి వచ్చిన నిరంతర విద్యుత్, ప్రభుత్వం అందిస్తున్న పన్ను రాయితీలు, ప్రోత్సాహకాల నేపథ్యంలో దేశీయ పారిశ్రామిక దిగ్గజాలను చంద్రబాబు విశేషంగా ఆకట్టుకున్నారు. ఈ దిశగా ఆయన చర్యలు కొంతమేర ఫలితాలను కూడా ఇచ్చాయి. ఇక సీఎం హోదాలో చైనా, జపాన్, దక్షిణ కొరియాల్లో చంద్రబాబు జరపనున్న పర్యటన భారీ ఎత్తున పెట్టుబడులను ఆకర్షించడం ఖాయంగానే కనిపిస్తోంది.
More Telugu News
-
కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్
-
కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి
-
భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు
-
చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!
-
ఒక్క ఓవర్ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి
-
భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్
-
గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు
-
"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ
-
భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!
-
ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్
-
'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి
-
ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు
-
వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు
-
పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్
-
సౌదీలో చిక్కుకున్న ఉమ్రా యాత్రికులు.. రంగంలోకి దిగిన ప్రభుత్వాలు