Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

తెలంగాణ ఇంటర్ బోర్డు ఏర్పాటు చేస్తూ జీవో జారీ

తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యేక ఇంటర్ బోర్డు ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం జీవో నంబర్ 21ను విడుదల చేసింది. ఈ క్రమంలో, త్వరలోనే తెలంగాణ రాష్ట్ర ఇంటర్ బోర్డుకు కార్యదర్శిని, ఆ తర్వాత పూర్తి స్థాయిలో బోర్డును నియమిస్తారు. బోర్డు కార్యదర్శి బాధ్యతల్ని తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ కార్యదర్శి వికాస్ రాజ్ కు అప్పగిస్తున్నట్లు తెలుస్తోంది. ముఖ్యమంత్రి కేసీఆర్ రెండు రోజుల కిందటే (శనివారం) తెలంగాణ ఇంటర్మీడియెట్ విద్యా మండలి ఏర్పాటు ప్రతిపాదనకు ఆమోదం తెలిపారు. ఆ మేరకు ఉన్నత విద్యాశాఖ రూపొందించిన చట్టం ముసాయిదాపై సంతకం చేశారు. రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టం ఆధారంగా... ఏపీ ఇంటర్మీడియెట్ ఎడ్యుకేషన్ చట్టం-1971ను తెలంగాణకు వర్తింపజేస్తూ ఉన్నత విద్యాశాఖ ముసాయిదాను తయారు చేసింది.

More Telugu News