వికలమైన మనసుతో... సీఎం చంద్రబాబు చెమటోడ్చారు!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

వికలమైన మనసుతో... సీఎం చంద్రబాబు చెమటోడ్చారు!

విశాఖను సందర్శించేందుకు వచ్చే వారు ఎవరైనా సరే తప్పక సందర్శించే ప్రముఖ పర్యాటక ప్రాంతం కైలాసగిరి. ఆ శిఖరంపైకి ఎక్కే చిన్నపిల్లలు విశాఖలో తమ ఇల్లు ఏ ప్రాంతంలో వుందో అక్కడి నుంచి సరదాగా వెతుక్కుంటారు. అంటే, విశాఖ నగర అందాలు అంత అద్భుతంగా అక్కడి నుంచి మనకు కనిపిస్తాయి. పెద్దవాళ్లు ప్రకృతి పారవశ్యాన్ని పొందుతూ తన్మయత్వం చెందుతారు. అలాంటి కైలాసగిరిని హుదూద్ తుపాను కకావికలం చేసింది. పచ్చని చెట్లతో అలరారిన కైలాసగిరి నాగలితో దున్నేసి చెట్లను వేళ్లతో పెకలించివేసినట్టు మారిపోయింది. ఈ ప్రదేశాన్ని సందర్శించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆవేదన చెందారు. రాడార్ కేంద్రం స్థితిగతులు తెలుసుకున్న సీఎం ఆ చెట్లను చూసి తట్టుకోలేకపోయారు. పని వాళ్ల చేతుల్లో రంపం తీసుకుని చెల్లాచెదురుగా పడి ఉన్న కొమ్మలను తనే కోశారు. ఆ ప్రాంతం చదును చేసేందుకు శ్రమించారు. సాక్షాత్తు ముఖ్యమంత్రే చెమటోడుస్తుంటే సిబ్బంది రెట్టించిన ఉత్సాహంతో పనులు చేశారు.

More Telugu News