ఆసియా నోబెల్ పురస్కారం అందుకున్న సౌతాఫ్రికన్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఆసియా నోబెల్ పురస్కారం అందుకున్న సౌతాఫ్రికన్

దక్షిణాఫ్రికాలో జాతివివక్షకు వ్యతిరేకంగా పోరాడిన అల్బీ సాచ్స్, నార్వేలో పర్యావరణ పరిరక్షణ కోసం కృషి చేసిన ఆ దేశ మాజీ ప్రధాని గ్రో హాలెమ్ బ్రంట్‌లాండ్, మరో ముగ్గురికి ఆసియా నోబెల్‌ బహుమతిగా పేరొందిన ‘తాంగ్ ప్రైజ్’ను తైవాన్ అధ్యక్షుడు మా యింగ్ జ్యూ ప్రదానం చేశారు. 2012లో తైవాన్‌లో అత్యంత ధనవంతుల్లో ఒకరైన సామ్యూల్ యిన్ ప్రసిద్ధ చైనా రాజవంశం ‘తాంగ్’ పేరుమీద ఈ పురస్కారం అందజేస్తున్నారు. ఈ పురస్కారం కింద పురస్కార గ్రహీతలకు 5 కోట్ల తైవాన్ డాలర్లు అంటే సుమారు 10.33 కోట్ల రూపాయలు అందజేస్తారు. ఈ మొత్తం నోబెల్ బహుమతి విజేతలకు లభించే మొత్తంకన్నా ఎక్కువే. 2014 నుంచి పర్యావరణం, మానవహక్కులు, వైద్యం, చైనా చరిత్ర వంటి రంగాల్లో అద్వితీయ సేవలందించిన వారికి ఈ పురస్కారం అందజేయనున్నారు.

More Telugu News